Others

ఈ పాప బాధ తీర్చలేనిది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ అమ్మాయి పేరు జెస్సీ.. వయస్సు పదకొండు సంవత్సరాలు.. మెక్సికోకు చెందిన జెస్సీ యూట్యూబ్‌లో చాలా పాపులర్ స్టార్. ఈమె యూట్యూబ్ చానల్‌కు ఇప్పటివరకూ 13.5 కోట్ల వ్యూస్ వచ్చాయి. వీడియోలు చేయడానికి, కెమెరా ముందు మాట్లాడటానికి ఆమెకు ఎలాంటి స్క్రిప్టూ అవసరం లేదు. కెమెరా ముందుకు రాగానే సంతోషంగా గలగలా మాట్లాడేస్తుంది. ఆ లక్షణమే ఆమెకు అంతటి ఆదరణను తీసుకొచ్చింది. తన సోదరుడు పెపెతో కలిసి జెస్సీ వీడియోలను రూపొందిస్తూ ఉంటుంది. డిస్నీ కోసం చేసిన ఓ వీడియోకు ఏకంగా 2.2 కోట్ల వ్యూస్ వచ్చాయి. తన వీడియోలను చూసి ప్రజలంతా సంతోషించాలని, తనకు బాగా పేరు రావాలనేది జెస్సీ కోరిక. అయితే.. కొన్ని వీడియోలకు తను ఆశించిన స్థాయిలో వ్యూస్ రాకపోతే ఆమె ఒక్కోసారి నిరాశకు గురయ్యేది. తరువాత మరో మంచి వీడియోతో యూట్యూబ్‌లో మెరిసేది. ఒకరోజు జెస్సీ ఉన్నట్లుండి యూట్యూబ్‌లో వీడియోలను పోస్ట్ చేయడం ఆపేసింది. కొద్దిరోజులు గడిచిన తరువాత మళ్లీ ఓ వీడియోను పోస్ట్ చేసింది.. అదేంటంటే.. ‘‘హలో.. నా పేరు జెస్సికా.. మీ అందరికీ నేను జెస్సీగా తెలుసు.. నా జీవితం ఎలా మారిపోయిందో.. ఈ రోజు మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా..’’ అంటూ ప్రారంభమైన ఈ వీడియోలో జెస్సీ తన జీవితంలో జరిగిన ఓ విషాద సంఘటనను వివరించింది. జెస్సీ తల్లిపేరు అలైసియా.. జెస్సీ, ఆమె సోదరుడు పెపెల జీవితంలో వాళ్ల అమ్మ ఎంతో ముఖ్యమైన వ్యక్తి. ‘‘ఓ రోజు అమ్మకు బాగోలేదు. ఆమె నొప్పితో చాలా బాధపడింది. చివరికి ఆమెకు కేన్సర్ చివరిదశలో ఉందని తేలింది.. కొద్దిరోజుల్లోనే ఆమె చనిపోయింది.’’ అంటూ వీడియోను ఆపేసింది జెస్సీ.. అలా ఆ చిన్నపాప జీవితంలో జరిగిన విషాధ సంఘటన చాలామందిని కంటతడి పెట్టించింది. తన తల్లిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని భావించిన జెస్సీ ఇక వీడియోలను చేయడం మానేసింది. తల్లిని తల్చుకుంటూ తన పనుల్లో తను మునిగిపోయింది. తరువాత జెస్సీ సోదరుడు పెపె తన తల్లి కవల సోదరితో కలిసి ఓ వీడియోను రూపొందించాడు. ఈ వీడియోకు ఇప్పటికే అరవై లక్షల వ్యూస్ వచ్చాయట.. ఇంకా వస్తూనే ఉన్నాయట.. ‘‘కొంతకాలంగా జెస్సీ యూట్యూబ్‌కు దూరంగా ఉండటం వల్ల కొద్దిగా ఆదరణ తగ్గింది. కానీ అమ్మను మర్చిపోవడానికి ఈ వీడియో సాయం చేస్తుందేమో అనిపిస్తోంది’’ అని అంటున్నాడు జెస్సీ సోదరుడు పెపె.. ఏది ఏమైనా జెస్సీ తన తల్లి జ్ఞాపకాల నుంచి బయటపడి మరిన్ని వీడియోలు చేయాలని ఆమె అభిమానులు భావిస్తున్నారు.