Others

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందిగ్ధమైన స్మృతిలా ఉన్నదట. స్మృతులంటే మన్వాదిస్మృతులు. అందువలన నిపతితమైన బుద్ధిలా ఉన్నదట. ఆ తల్లి స్మృతిరూపమే. కాని రుూ రూపంలో ఆ లక్షణం కప్పబడింది. శ్రద్ధ అంటే అస్తిక్యబుద్ధి. అది విహతమైంది. అవిశ్వాస బహుళమైన శ్రద్ధ వలన ఆశ ప్రతిహతమవుతున్నది. ఆమె శ్రద్ధా స్వరూపం. కాని రుూ పొర అడ్డుపడ్డది.
సిద్ధికి విఘ్నమేర్పడింది. దానివలన బుద్ధి కలుషమైంది. ఆ తల్లి బుద్ధి స్వరూపము. అది రావణ స్పర్శవలన కలుషమైంది. అసత్యవాదంవలన పతితయైన కీర్తిలా వుంది. ఆమె కీర్తి స్వరూపం అది రామ వియోగాన్ని పొందింది. దానికి కారణమైనవాడు పతితమవుతాడు.
అమ్నాయముల యోగం లేని శిథిలవిద్యలా ఉంది. ఆ తల్లి విద్యా స్వరూపము. ఆమ్నాయాలంటే శ్రీవిద్యా సంప్రదాయంలోని షడామ్నాయాలు. పూర్వ దక్షణ పశ్చిమ ఉత్తర ఊర్థ్వ, అనుత్తర అని ఆరు. ఇవి ఉపాస్య దేవతను బట్టి భిన్నంగా ఉంటాయి. శ్యామలామ్నాయము. లలితామ్నాయము మొదలైన రీతి. ఈ అమ్నాయషట్కంతో యోగం లేకపోతే ఆ శ్రీవిద్య శిథిలమైనట్లుంటుంది. విద్య క్షీణించదు. విద్య ఆ పురుషుని యందు అదృశ్యమవుతూ వానిని క్షీణింపజేస్తుంది.
బుద్ధిమంతుడయిన వాడు తనయందు విద్య క్షీణిస్తోందని అది అదృశ్యం కాకముందే తెలిసికొని దానిని ఉపాసిస్తాడు.
అందుకే స్వామికి ఆ తల్లి అలా కనబడి తనను హెచ్చరించినట్లయింది. బుద్ధిలేని రావణునికి ఆ విద్యా తత్వం గోచరించదు. అందుకే ఆమె యెప్పుడు వానికలా కన్పించలేదు. సరే, ఇన్నివిధాలుగా ఆలోచించిన తరువాత తిరిగి స్వామి ఆమె సీతే అయి ఉంటుందని కారణాల్ని ఉపపాదించుకొంటూ ఆలోచిస్తున్నాడట. ఇక్కడ బాహ్యంగా ఆలోచిస్తే- ఆమె సీత కావడానికి కారణాల్ని ఊహిస్తాడని తెలిసింది. కానీ- ఆంతర ధర్మంగా ఆలోచిస్తే ఇంతవరకు తాను దర్శించిన దానివలన ఆమె సీత అని తేలిందట. అంటే- భూమినుండి ఉత్థిత అయిన సీతగా తేలిందట.
ఇప్పుడు తనకు ఆ భూమియందే- అనగా మూలాధారమందే మగ్నమైన విద్యగా కనబడుతోంది. మూలాధారమందు కప్పబడి ఉండే కుందలినీ శక్తి ఈనాటి సీతలాగే ఉంటుంది. అది ఉత్థితమయితే ఆంజనేయస్వామి వంటి ఉపాసకునకు బ్రహ్మత్వమీయగలిగి ఉంటుంది.
స్వామి సీతను చూసేడు.
అస్యా దేవ్యా యధా రూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం
రామస్య చ యధారూపం తస్యే యమసితేక్షణ
ఆ తల్లి అంగ ప్రత్యంగ రూపమూ రామరూపం ఎలా ఉందో అలాగే ఉందట విశేషించి ఈ నేత్రములయందు మాతృత్వమున్నది.
అటువంటి సీతా హృదయంలో స్వామికి రామచంద్రమూర్తి దర్శనమిస్తున్నాడు. తాను బయలుదేరే ముందు స్వామి రామహృదయంలో సీతాదర్శనం చేసికొని బయలుదేరేడు. ఆ విషయాన్ని అక్కడ చెప్పరు. మహర్షి ఇక్కడ చెబుతున్నారు. ఏమని-
అస్యాదేవ్యా మనస్తస్మింస్తస్య చా‚స్యాం ప్రతిష్ఠితమ్.
ఇది దేవియందు దేవునియందు ఉపాసకుడు పొందే అభేద దృష్టిజ ఆ దృష్టి రుూవేళ స్వామికి కలిగింది. ఈ దృష్టి కలవారికే సృష్టి రహస్యం తెలుస్తుంది. ఆ రహస్యం తెలిసిన వానికే సృష్టి చేయగలిగే శక్తి కలుగుతుంది. అది ఆంజనేయ స్వామికి భవిష్యత్తులో కలుగుతుంది.
దుష్కరం కృతవాన్ రామో హీనో యదనయాప్రభుః
ధారయత్యాత్మనోదేహం నశోకే నావ సీదతి.
దుష్కరం కృతవాన్ రామో య ఇమాం మత్తకాశినీం
సీతాం వినా మహాబాహుః ముహూర్తమపి జీవతి.
సీతా వియోగంవలన రామచంద్రమూర్తి శోకాన్నికాని కార్స్వాన్ని కాని యెఱుగక జీవించటం
సీతా విహీనంగా ఒక్క క్షణం కూడా జీవించి ఉండటం- ఇవి రెండునూ దుష్కరమైన కర్మలు. వాటిని రామచంద్రమూర్తి చేస్తున్నాడు. ఆహా! ఎంత కష్టం.
ఇంకావుంది...