Others

పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీచక్రము-మానవశరీరము
ప్రతులకు:
H.No. 7-8-51, Plot No. . 18, నాగార్జున సాగర్‌రోడ్, సెంట్రల్ కాలనీ ఫేజ్ -2, హస్తినాపురం, హైదరాబాద్- 500079
===============================================================
ముగింపు: రేఖా, పద, బీజ, సంఖ్యా ప్రపంచములన్నియు నిత్యము, శాశ్వతము, పరము, పూర్ణమ, బ్రహ్మము అని కీర్తింపబడుచున్న ఒకే మూల కారణమునుండి వెలువడిన, వృత్తము, సంవృత్త, అకారము, ప్రణవము, అనంతములని తెలియుచున్నది. వేదాంతపరంగా చూస్తే కారణ బ్రహ్మము పూర్ణము- అనంతము అయినట్లే, కార్యరూపమైన జగత్తు కూడా పూర్ణము అనంతముల చేతనే సూచించబడుతోంది. కాబట్టి కారణ బ్రహ్మమే కార్య బ్రహ్మముగా జగద్రూపమున ఆవిర్భవించినదని తెలుసుకోవాలి.కారణ బ్రహ్మమును (జీవుడు) గాను, కార్యబ్రహ్మమును (జగత్తు)గాను భావిస్తే అవి రెండూ ఒకే పూర్ణబ్రహ్మము యొక్క పూర్ణత్వ ప్రతిపాదకములని తెలుస్తోంది. అదే విధంగా జీవుడు, జగత్తు- పిండాండ, బ్రహ్మాండములు రెండును ఒకే పూర్ణములో లయిస్తాయని అర్థవౌతోంది. అంటే పూర్ణమెల్లప్పుడు పూర్ణముగానే భాసిస్తోంది. ఈ విషయాన్ని వేదమాత పరమపవిత్రమైన శాంతిమంత్రంగా గొంతెత్తి చెబుతోంది చూడండి.
‘‘ఓం పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముదచ్యతే
పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమేవా వశిష్యతే’’
- కారణ వస్తువైన బ్రహ్మము కార్యరూపమైన జగత్తుగా పరిణమించడాన్ని ‘వివర్తన’మంటారు. అట్టి వివర్తనం జగత్తులేక ప్రపంచమని సంభవింపబడుతోంది. తిరిగి యిట్టి వివర్తమే పద బీజ, సంఖ్యా, రేఖాత్మకమనబడే నాలుగు ప్రపంచములుగా బ్రహ్మమునందు భాసించుచున్నది. తిరిగి యిట్టి ప్రపంచ ప్రబేధములెన్నియైనను బ్రహ్మమునందే లయించును. కావుననే బ్రహ్మమెప్పటికిని అనంతము, పూర్ణము పరము, అద్వితీయమనబడుచున్నది.
అమెరికాలో నివసిస్తున్న భారతీయ శాస్తవ్రేత్త డా.హరగోవింద ఖురానా, గుణాణువులయొక్క వౌలికమైన గుణాలను ప్రతిపాదించారు. యోగసాధనతో ఆధ్యాత్మిక చరమస్థితి అద్భుతాలకు చేర్చే కుండలిని శక్తి జాగృతి విషయంలో, రుూ గుణాణువుల సిద్ధాంతమెంతగానో ఉపకరిస్తుందనే విషయం, ఆధునిక శాస్త్రానికి పట్టకపోవచ్చు. కాని, మన శరీరంలో ఉన్న అసంఖ్యాకమైన కణాలులో కేంద్రకము వున్నది, ఈ కేంద్రకములో క్రోమోజోమ్స్ వుంటాయి. క్రోమోజోమ్స్‌లో జీన్సు ఉంటాయి.
జీన్సులో గుణాణువులు ఉంటాయి. మన శరీరంలోని ప్రతి అవయవంలో అసంఖ్యాకమైన కోశికలు ఉంటాయి. వీటిలో పైన చెప్పిన గుణాణువుల యొక్క సాపేక్ష అమరిక శరీరాన్ని నిర్మించే కోశికలయందు పరస్పరంగా తదనుగుణమైన గుణాలనుద్భవింప చేస్తూ, మనలో ఆ గుణాలనే కలుగజేస్తాయి. జీన్సులో సర్పాకృతి (ఒక మెలిక) మాదిరిగా వుండే ‘గుణాణువుల’ సాపేక్ష అమరికనుబట్టి, మానవుని లక్షణాలుంటాయి. అందువల్లనే చాలావరకు ఒక్కొక్కరి లక్షణాలు ఒక్కొక్క విధంగా వుంటాయి. కాబట్టి గుణములు లేక సంస్కృత భాషలో ‘‘కుండల్’’అంటే సర్పాకృతి అని అర్థం. పైన చెప్పిన గుణాణువులు చలించే మార్గమొక సర్పాకృతిని పోలి ఉంటుంది.
ఆ కుండలములోనున్న సాపేక్ష శక్తినే యోగశాస్తమ్రులో ‘‘కుండలిని’’అంటారు.
మన ప్రాచీన భారతీయ విజ్ఞానమెంత వున్నతమైనదో గమనించండి. మన సనాతన ఋషి పుంగవులకు, మానవ శరీరమందలి కోశికలు, వాటి యందలి గుణాణువుల సాపేక్ష అమరిక, తత్సంబంధమైన విషయ విజ్ఞానము మొదలగు అనేక విషయాలకు సంబంధించిన అనేక అద్భుత రహస్యముల గురించి బాగుగా తెలియునని స్పష్టవౌతున్నది. కుండలినీ శక్తి శరీరమంతటా నిండి యున్న కోశికలందలి గుణాణువుల అమరికతో కూడియున్నదని తెలుసుకున్నారు. కుండలినీ శక్తియోగ ప్రక్రియద్వారా జాగృతమైనప్పుడు, మన శరీరమందు కొన్ని చర్యలు(స్థితులు) అనుభూతమగును.
ఉదాహరణకు కొన్ని పరిశీలిద్దాము. కుండలిని జాగృతమయ్యేటప్పుడు సాధకుడైన యోగి శరీరమందలి, కోశికలలో ప్రవహించే విద్యుత్ ప్రవాహము, నాలుగు రకాలుగా ఉండునని చెప్పబడింది. 1) పిపీలికము (చీమ) 2) దర్దూరము 3) సర్పము 4) విహంగము. కుండలిని యొక్క అధిక సమాచారముకొరకు వైదిక్ విశ్వప్రచురణలు హైదరాబాదు వారిచే ప్రచురించబడిన, యోగాచార్య ‘కాకాజీ’గారి ‘కుండలిని’ గ్రంథమును పరిశీలించగలరు.
ఇంకావుంది...

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9849560014