Others

శ్రీమద్రామాయణ విశిష్టత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరామచంద్రుడు అరణ్యవాసం పేరిట భారతదేశమంతా సంచరించి ధర్మదేవతకు ఉపద్రవం కలిగిస్తున్న రాక్షసుల మదమణచి సనాతన ధర్మానుష్టానమునకు కలిగిన విఘ్నములను తొలగించి ప్రజలకు సంతోష ముదం కలిగించాడు. అందుకే నేటికి జనులు శ్రీరామ రాజ్యమును మాటను శ్రేష్టమైనదను అర్థంతో వాడతారు. అంతటి మహనీయుని చరిత్రను తెలిపేదే శ్రీమద్రామాయణం. సుప్రసిద్ధ శ్రీమద్రామాయణం శ్రీ వాల్మీకి మహర్షిచే రచించపబడి బ్రహ్మ చేత పూజింపబడిన దివ్య చరితం.
గాయిత్రీ స్వరూపం, సాక్షాత్తు శ్రీమహావిష్ణువు చరితం ఓ యదార్థగాధ! ఓ చారిత్రక వాస్తవం! శ్రీ వాల్మీకి మహర్షి వల్మీకం (పుట్టలో) నందు పుట్టుటచే అతనికి ఆ పేరు. ఇతడు ఆదికవి. ఇలాంటి కావ్యం ప్రపంచంలో ఏ భాషలోను పుట్టలేదు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ మరియు యుద్ధకాండలుగా నిర్మించబడినది ఈ కావ్యం.
ఈ కావ్య శ్లోకముల సంఖ్య 24 వేలు. ఒక్కొక్క వేయిలో మొదటి శ్లోకం, ఒక్కొక్క చోట గాయిత్రీ మంత్రాక్షరాలచే ఆరంభించబడి ఉండటంవల్ల ఈ కావ్యం గాయిత్రీ రూపమని అంటారు. తండ్రీ కొడుకులు, భార్యాభర్తలు, స్నేహితులు, సోదరులు, యజమాని, సేవకుడు, గురుశిష్యులు, రాజు ప్రజలు అనుసరించవలసిన తీరుతెన్నులకు అపురూప అద్వితీయ మానవ సంబంధాలకు శ్రీమద్రామాయణం అత్యంత ప్రమాణం.
ఈ కావ్యపఠన ఫలంగా సకల జీవులకు సౌభాగ్యం, యశస్సు, ఆయుష్షు, నైతికత వృద్ధి పొందడమేగాక సత్సాంతన సౌభాగ్యం, ధనప్రాప్తి, పాపవిముక్తి, సత్కీర్తి, మరణానంతరం పరలోక ప్రాప్తి కలుగుతాయి. శ్రీమద్రామాయణంలో కేవలం ఒక్క శ్లోకం చదివినా, వినినా సకల పాప విముక్తులౌతారని ప్రశస్తి. అలాగే ఒక్క సర్గ విన్నా వేయి అశ్వమేధ, పదివేల వాజపేయ యాగముల ఫలాన్ని పొందుతారని ఋషి వాక్కు. అంతేగాక ఈ లోకంలో శ్రీరామాయణ కావ్యం శ్రవణ మాత్రం చేతనే ప్రయాగాది తీర్థములకు, గంగానది నదులకు, నైమిశారణ్యాది అరణ్యములకు కురుక్షేత్రాదులకు యాత్ర చేసినట్లే అని అందరి విశ్వాసం! శ్రీమద్రామాయణంలో ఆధ్యాత్మిక, ధార్మిక అంశాలెన్నో ఇమిడి ఉన్నాయి. ఇందులోని పాత్రలు భారతదేశ సంస్కృతికి సంప్రదాయాలకు, మానవ సంబంధాలకు, ధర్మసూత్రాలకు పునాదులు వేశాయి. ప్రాచీన భారత సాహిత్యంలోని అతి గొప్ప గ్రంథాలలో ఒకటైన శ్రీరామాయణం కేవలం భారతదేశానే్న గాక ఆగ్నేయాసియా ప్రాంత సంస్కృతిని మొత్తం ప్రభావితం చేసింది. చిన్న చిన్న విషయాలే పరిపూర్ణత్వానికి దారితీస్తాయి. కాని పరిపూర్ణత మాత్రం చిన్నవిషయం కాదు. అందుకే శ్రీమద్రామయణం ప్రతి ఒక్కరికి పూర్ణ వ్యక్తిత్వ వికాస గ్రంథం! ధర్మాన్ని ధర్మం కోసమే అన్న రీతిలోనే పాటించాలని అది మనకు తెచ్చే లాభ నష్టాల్ని దృష్టిలో ఉంచుకుని కాదనీ రామాయణం చెబుతుంది. ఇందులో శ్రీరాముడు కేవలం మానవుడుగానే మానవ సహజమైన లక్షణాలతో కనిపిస్తాడు. కాని దైవస్వరూపుడిగా కాదు, రాముడు ధర్మాన్ని పాటించేటపుడు మామూలు మానవుల్లాగే దుఃఖాన్ని, ఆనందాన్ని అనుభవించాడు. ‘రామోవిగ్రహవాన్ ధర్మః’- మూర్త్భీవించిన ధర్మస్వరూపమే శ్రీరామచంద్రుడు! ఈ సత్యాన్ని తెలిసికొని అత్యుత్తమమైన శ్రీమద్రామాయణ కావ్యాన్ని పరిశుద్ధమైన అంతఃకరణతో పఠించాలి. నిత్యం శ్రీరాముని చరితం భక్తిపూర్వకంగా చదివినా, విన్నా పాపాలన్నీ తొలగి సంసారిక బంధాలనుండి విముక్తి పొంది ఉపశమనం కలిగి దీర్ఘాయువుతో సకల శ్రేయస్సులు, ధర్మ అర్థ కామ మోక్షములచే చతుర్విధ పురుషార్థములను పొందుతారనడం నిర్వివాదాంశం. శ్రీరాముని స్ఫూర్తిగా తీసుకొన్న ఏ మానవుడైనా ఉత్తమ పురుషుడు, ఉత్తమ భార్య, ఉత్తమ పాలకుడుగా తీర్చిదిద్దబడతాడు. అందుచేతనే మన పూర్వీకులు రామాలయం లేని గ్రామాల్లో ప్రవేశించరాదని చెప్పేవారు.

-ఎ.ఎస్.ఎన్.్భషణశర్మ