Others

హనుమ - శీలము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ హనుమ శీలసంపదతో రూపుదిద్దుకున్న వజ్రకాయుడు. ‘ది ఎంబోడిమెంట్ ఆఫ్ సిన్సియారిటీ అండ్ ఇండివిడ్యుయాలిటీ ఈజ్ ఆఫ్ హనుమ’(యాన్ ఐకాన్)- శీల సంపద అంటే వ్యక్తిత్వము, నిజాయితీతత్వం కలిగి వుండటమే. అన్యులతో పోల్చుటకు అలవికాని వ్యక్తిత్వమే ఆంజనేయతత్త్వం. ఎంత విద్యాధికులైనా శీలం కొరవడితే అనామకులౌతారు. శీలసంపద కలవారి ఆలోచనలు నిర్మలంగా వుండటమేగాక, విచాక్షణా జ్ఞాన సంపన్నులై వుంటారు. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలకు కృంగిపోవడం గాని లేక చిన్న సంతోషానికి పొంగిపోవడం గాని వుండదు.
శ్రీ హనుమ వినయశీలి, నిరహంగారి. అందుచేతనే సుఖ దుఃఖాలను సమాన దృష్టిలో వీక్షిస్తాడు. స్వామి మితభాషి కనుక ఆయన వ్యక్తిత్వానికి మరింత శోభ కలిగింది. స్వామికి బాహ్యాలంకరణ కంటే తన నడత, అంతరంగ హృదయ శోభ శీలమును ఇనుమడింపజేశాయి. మనిషి తన జీవితకాలమందు ధననష్టం జరిగినా తిరిగి పొందగలడు కానీ శీలమును నష్టపోతే తిరిగి పొందజాలడు.
ఎంతటి విద్యావంతులకైనా తమ శీలమే తమ విద్యకు శోభనిచ్చును. ‘శీలేన శోభతే విద్య’ అను వాక్యము తెలియనివారుండరు.
స్వామి కేసరి రాజ్యానికి యువరాజు. స్వామికి ఆభరణాలు, అలంకరణలు అవసరం లేదు. కేవలం కిరీటమే ఆయన ధరించునది, చేతిలో గదాయుధము ధరించుట- దుష్టశిక్షణ శిష్టరక్షణకు మాత్రమే. వజ్రకాయుడు గనుక ఏ రకమైన కవచములు అవసరంలేదు. స్వామి లక్ష్య సాధకుడు. తాను ఏ కార్యము తలపెడతారో ఆ కార్యము కొరకు నిరంతరం శ్రమించును. కర్తవ్య నిష్ఠ, అకుంఠిత దీక్ష, పట్టుదలలే లక్ష్యసాధనకు సోపానాలు. స్వామికి మడమత్రిప్పి వెనుదిరిగే స్వభావమే లేదు. స్వామి భక్తులకు కూడా అవే దీక్షాదక్షతలు కార్యసాధకులను చేస్తాయి.
పాలకులు శీలవంతులైతే తమ దేశంలో గౌరవించబడతారు. ప్రతిక్షణము ఉద్రిక్తత, ఉద్రిక్తతోపాటు తొట్రుపాటు, భయము, నిర్వీర్యతకు గురి అవుతున్నాము.
శ్లో మనోజవం మారుత తుల్యవేగం
జితేంద్రియం బుద్ధి మతాం వరిష్టవ్
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామ దూతం శిరసా నమామి
అస్థిరతతో కొండగుహలలో తలదాచుకున్న సుగ్రీవునకు రామ మైత్రి కలిగించి, భయాందోళనలనుంచి విముక్తిగావించాడు. ఇచట రామమైత్రి అంటే ప్రతి మానవునియందున్న పరమాత్మ భావనతో ఆత్మబలం పెంపొందించుకొని, ప్రశాంతతను పొందటమే. దీనికి ప్రేరణ, సంధానకర్త మన స్వామియే.మానవునికి అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ మద మాత్సర్యములను దహించి రాక్షస భావనలను అంతమొందించుకొని జితేంద్రియులై మహనీయ తత్త్వాన్ని పెంపొందించుకొని ప్రతి మానవుని కార్యోన్ముఖులను చేయుటయే సుందరాకాండలో స్వామి తెలియజేసినది.
శ్రీరామతత్త్వాన్ని జీర్ణించుకున్న స్వామి ఆత్మబలంతో మంచి బుద్ధిగలవాడై జితేంద్రియుడైనాడు. రావణాసురుని అంతఃపురంలో సీతానే్వషణకై అడుగిడి బంగరు వనె్నతో వజ్రవైఢూర్యములు పొదగబడిన ద్వారములు, కిటికీలు పరికిస్తాడు. ఆ మహాగృహంలో శోభాయమానమైన మణిమయ ఖచితవౌ పుష్పక విమానమును చూచి, అంతటి భోగవంతమైన భవనమును తిలకించి ‘ఇది స్వర్గమా లేక ఇంద్రభవనమా? ముక్తిప్రదమైన బ్రహ్మలోకమా’ అని మహాత్ముడైన మారుతి ఆశ్చర్యానందములతో తిలకిస్తాడు. కాని సీతమ్మ జాడ కానరాక వెదుకుతూ అపురూప సౌందర్య లావణ్యములతో విరాజిల్లు అందమైన స్ర్తిలను చూశాడు కాని ఎచ్చటనూ మనస్సు చలించలేదు. వాటిమీద వ్యామోహముగాని, ఈర్ష్యగాని పొందక, తన బుద్ధిబలంతో జితేంద్రియత్వంతో, కార్యోన్ముఖుడై సీతాదేవి అనే్వషణే ధ్యేయంగా తన శీల శోభను చాటుతూ స్వామి ముందుకు నడుస్తాడు. కపీంద్రుడు రావణాంతపురమును పూర్తిగా పరికించి జానకీమాత జాడ కానరాకుండుటచే విచారముగా వెదకుచూ నడుమ పరకాంతలను చూచి, పరకాంతలను చూచుట యను కార్యము మహాపాపము కదా అని తలచి దుఃఖించి ఒకింత ఆలోచనతో ఇట్లు తలపోసెను.
ఈనాటి కుర్రకారుకి రానురాను శృంగారంలోనే కాదు- సారస్వతంలోనూ రసికత లోపించిపోతోందేనని శాస్ర్తీగారి మధన!
ప్రయాగ బాపన్న, శొంఠి, సుబ్బన్న, భీమరాజుల గురించి తాతయ్య సెలవిస్తుంటే- తెల్లమొహం వేసిన ఓ ఆంధ్ర భాషా ప్రధానాచార్యులు, పసిపిల్లాడిలా బిక్క చచ్చిపోయాడు.
‘‘వాళ్ళెవరో నాకు తెలియదు మహాప్రభో’’ అన్నట్టు తెల్లజెండా చూపించినా, ‘‘తెలియదనడం నీ వినయం- అది నిజమవుతుందా’’ అంటూ కంటికి కనిపించని కచీ కర్రతో కొట్టారు.
‘‘అలాంటి విషయాలు ఆచార్యులకు తెలియకపోవటం క్షమించరాని నేరం!.. అందుకే కాలేజీ మానేసి మడిగట్టుకు యింట్లో కూర్చుని-శుద్ధ నిర్గుణ కందార్థ దరువులు సాగించమను! ఉచ్ఛనీచాలున్న సారస్వతులకు అదే శిక్ష!’’ అంటూ ఆయన అక్కసు తీర్చుకుంటాను నేతి-నేతి కథలో.
అలాగే నీకు ఎవర్ని ప్రేమించాలో తెలియదు ఎలాప్రేమంచాలో అంతకన్నా తెలియదు. శంకరాచార్యుణ్ణి అనుకుంటున్నావా? శృంగారం, వేదాంతం కలగలిపి చలాయించుకు వచ్చేందుకు? ఆ అమ్మాయి నీ మీద అపేక్షతో వచ్చింది! లెక్చరు వినడానికి కాదు!’’ అంటూ మిత్రుడి ముఖం వాచేట్లు చీవాట్లు పెట్టాడు కథకుకుడు యక్షగానం కథలో.
- సశేషం

లక్కరాజు వెంకట పూర్ణచంద్రరావు (హనుమదుపాసకులు)