AADIVAVRAM - Others

అందమైన భోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇత్తడి పాత్రల్లో అత్తెసరు తిన్న శక్తి సంపన్నమైన జాతి మనది ఒకనాడు. ఆంగ్లేయుల పుణ్యమా అని సిల్వర్ పాత్రలు ప్రవేశించి జాతి నిర్వీర్యమైపోయింది. ఆనాడు ఉన్నవాడు ఇత్తడి పాత్రల్లో, లేనివారు కుండల్లో వండుకునేవారు. రెండూ ఆరోగ్యప్రదమైనవే.. పదార్థాల్లోని సారాన్ని నాశనం చేసే జర్మన్ సిల్వర్ పాత్రలకు తోడు దిక్కుమాలిన కుక్కర్లు వచ్చిపడ్డాయి. అందులో అంతా కుక్కటమే.. ఎంత కుక్కినా అన్నంతో పాటు పప్పో, కూరో ఒకటే.. ఇక ఆ కుక్కర్లో ఏది ఉడుకుతుందో..? ఏది ఉడకదో..? ఆ పరమాత్మునికే ఎరుక! ఏ మూతో లీకై కూత కూసిందా? ఇక ఆ పూట ఉడికీ ఉడకని మెతుకే మన బతుకు! ఇల్లాలి టీవీ మైకంలో కూతల గణన తప్పినా గతి అంతే! అదేమని? ప్రశ్నిస్తే 3మూడు కూతలొచ్చాయి! నాలుగు కూతలొచ్చాయి! అయినా ఆహారం ఎందుకు ఉడకలేదో..?2 ఇదీ సమాధానం! ఇక స్విగ్గీలు, జొమాటోలు వచ్చాక ఆ పని కూడా తప్పింది. ఒక్క మెసేజ్ చాలు.. వండిన వంట ఇంట్లోకి వచ్చేస్తుంది. అది సద్దిదో.., పాచిదో.. అనవసరం. వండిన పదార్థమైతే చాలు.. తినేయడమే. వండేవారు ఎలా వండారు.. శుచిగానేనా.. అన్న ఆలోచన కూడా ఉండదు.
ఇక వడ్డన విషయానికి వస్తే.. ఎంత అందమో! ఆ టేబుల్ పై పెట్టేయడం.. పనిదినాల్లో అయితే కావలసింది ఇంత డబ్బాలో పెట్టుకుపోవడం.. ఇద్దరూ ఉద్యోగులైతే తలా ఓ డబ్బా! పేచీ లేని పని! కనీసం ఆదివారాలు.. సెలవు దినాల్లో అయినా చక్కగా వడ్డించే పద్ధతి ఎంత అందం! అది కూడా ఎలా? వంట అంతా అయిన తరువాత..
వాలుజడల భాగ్యం ఎలాగూ కనుమరుగైపోయింది. ఉన్న కొత్తిమీర కట్ట జుట్టును చుట్టచుట్టేయడం కాక చక్కగా అల్లుకోవాలి. ఉన్న ఆభరణాలన్నీ అలంకరించుకుని, మంచి చీర కట్టుకొని అందంగా వడ్డిస్తూంటే ఆ రుచే వేరు. రోజూ చూచేదే కదా! ఇప్పుడు కొత్తగా అందం ఏమిటని కాదు. 3క్షణే క్షణే యన్నవతా ముపైతి తదేవ రూపం రమణీయాతాయాః2 అని ఆలంకారికులు నిర్వచించినట్లు చూసిన ప్రతీసారీ కొత్తగా కనిపించేదే అందం కదా!
పారిజాతాపహరణంలో శ్రీకృష్ణుడు, నారదాదులకు అతివలు భోజనం వడ్డించిన తీరు చూడండి!

శాకపాకంబుల చవులు వక్కాణించు
గతి కంకణములు ఘల్లుమనగ!
అతివేగమిడుడు మీరను మాడ్కి మేఖలా
కీలిత రత్నకింకిణులు మొరయ!
కలమాన్న రుచితోడ కలహించి జాడ దు
వ్వలువ పింజలు ఫెళఫెళ యనంగ!
ఆరగింపుడు మీరలని ప్రియంబాడెడు
పొలుపున మెట్టియ ల్గులుకరింప!

అలరుబోడులు వడ్డింప నచట కలహ
భోజియును తాను బహుభక్ష్య భోజ్య లేహ్య
చోష్య పానీయముల మధుసూదనుండు
సారె గొనియాడుచును వేడ్క నారగించె!
ఈ ఆదివారం నుంచి అయినా ఇలా అందంగా ఆరగిద్దాం!
ఇప్పటికే అరిటాకుల్లో అందంగా వడ్డిస్తూన్న అలరుబోడులకు అభివాదములు! అభినందనలు!!