Others

అదే జోరుతో....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంటిల్‌మన్ చిత్రం విడుదలయ్యాక అందరి దృష్టీ హీరోయిన్ నివేదా థామస్‌పైనే పడింది. గ్లామర్‌కి గ్లామర్. నటనకి నటన రెండూ చూపించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. తొలి చిత్రంతోనే ప్రేక్షకులను, పరిశ్రమను ఆకట్టుకున్న నివేదాథామస్‌కు అవకాశాలు ఎదురొస్తున్నాయి. ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ల సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అయితే ఇప్పుడిప్పుడే కళ్లుతెరుస్తున్న నివేదాథామస్ తన కండిషన్లను కూడా అప్లై చేస్తోంది. సినిమా అంటే గ్లామర్. గ్లామర్‌గానే నటిస్తాను. కానీ స్కిన్‌షోలు చేయమంటే మాత్రం చేయనంటోంది.
స్కిన్‌షో అనేది కేవలం నటన చేతకానివాళ్లు చేసేది. అంత అవసరం తనకు లేదు. గ్లామర్‌గానే కనిపిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తానని చెబుతోందట. అయినాకానీ నిర్మాతలు ఆమె కండిషన్లకు ఒప్పుకుంటున్నారు. తొలినాళ్లల్లో రకుల్‌ప్రీత్‌సింగ్‌కు ఎంత డిమాండ్ ఏర్పడిందో ప్రస్తుతం నివేదాథామస్‌కు అంతే ఆదరణ లభిస్తోంది.