Others

గుణసుందరి కథ (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరవై వసంతలు పూర్తి చేసుకొన్న అచ్చతెనుగు జానపద చిత్రం ‘గుణసుందరి కథ’. అప్పట్లో కలెక్షన్లతో బాక్సాఫీసును బద్ధలుకొట్టిన చిత్రం. ఒకప్పుడు ప్రేక్షకులు పౌరాణిక, సాంఘీకాలకన్నా జానపదాలనే ఎక్కువగా ఆదరించారు. వాహిని, విజయవారి చిత్రాలంటే చెప్పాల్సిన పని లేదు. అటువంటి చిత్రమే ‘గుణసుందరి కథ’. దుఃఖ పాత్రలకు పెట్టిది పేరైన జూనియర్ శ్రీరంజని కథానాయికగా, హాస్యనటుడు శివరావు హీరోగా నటించి చిత్రానికే వనె్నతెచ్చారు. ‘యాజ్ ఐ లైక్ ఇట్’ ఆంగ్ల నాటకం దీనికి మాతృక అని అప్పట్లో కొందరంటే, షేక్స్‌పియర్ నాటకం కింగ్ లియర్ ఆధారమని కొందరు అన్నారు. కాని, వాటి ఛాయలు ఎక్కడా కనిపించకుండా కెవి రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథ తయారీకి కమలాకర కామేశ్వర రావు, పింగళి నాగేంద్రరావు లాంటి దిగ్గజాలు కెవి రెడ్డికి సహకరించారట. ముసలిరాజు ఉగ్రసేనగా గోవిందరాజుల సుబ్బారావు నటించిన చిత్రం అప్పట్లో బహుళ జనాదరణ పొందింది. ఆయన రాచపుండుకు వైద్యం కోసం మణి తెచ్చేందుకు బయలుదేరుతారు గుణసుందరి బావలు హరమతి, కళామతి, ఆమె భర్త దైవాదీనం. మణిని సంపాదించాక దైవాదీనాన్ని బావిలో పడేస్తారు తోడల్లళ్లు. ఇక్కడ రాజభవనంలో అక్కలు రూపసుందరి, హేమసుందరిలు తమ భర్తలే మణిని తెస్తారంటూ బీరాలు పలుకడంతో గుణసుందరి తట్టుకోలేకపోతుంది. -‘మీరనుకున్నట్టు నా భర్త అవివేకి, వికలాంగుడూ కాదు’ అంటూ రహస్యాన్ని బయటకు చెప్పేస్తుంది. రహస్యం విప్పేయడంతో శాపం కారణంగా బావిలో పడిన గుణసుందరి భర్త ఎలుగుబంటుగా మారిపోతాడు. గుణసుందరి బావలు మణిని దొంగిలించినా మంత్రం చాతకాకపోవడంతో అసలు విషయం బయటపడుతుంది. రాజు తన తప్పు తెలుసుకొంటాడు. మొదట మాకు ‘తండ్రే సర్వస్వం’ అన్న కూతుళ్లు ఆయనను గాలిలోకి వదలిపెట్టి వెళ్లుతారు. తనకు తండ్రే సర్వస్వం అయినా, వివాహమైన తర్వాత భర్తే సర్వస్వం అన్న గుణసుందరిని దగ్గరికి తీసుకొంటాడు పశ్చాతప్తుడైన వృద్ధరాజు. జూనియర్ శ్రీరంజని, శివరావు, గోవిందరాజుల సుబ్బారావు మొదలగు హేమాహేమీలంతా పోటీపడి నటించిన చిత్ర రాజం ‘గుణసుందరి కథ.’ ఈ సినిమా నాకు చాలా ఇష్టం.

-కె సుబ్రహ్మణ్యం