Others

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవతలచేత ప్రశంసింపబడిన స్వామి తాను తన ప్రభువును ప్రశంసిస్తున్నాడు. అందుకే-
ఏవం సీతాం తదా దృష్ట్య్వా హృష్టః పవన సంభవః
జగామ మనసా రామం ప్రశశంస చ తం ప్రభుమ్
పవన సంభవుడైన స్వామి సీతాదర్శనాన్ని చేసికొన్నాడు. ఆనందాన్ని పొందేడు. ఉపాసకునకు ఉపాస్య దేవతా దర్శనమైంది. వెంటనే మనో లక్షణంతో రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళేడు. ఇటువంటి భార్యను పొందినందుకు ఆయనను ప్రశంసించేడు.
నిజానికి ఇక్కడితో సుందరకాండ పూర్తిఅయింది. అంటే మానసిక ఉపాసన పూర్తిఅయింది.
లలితా స్వరూపంగా సీతా సాక్షాత్కారమైంది. ఇక్కడికి దర్శనాన్ని కలిగించడం ఆ ఆనందాన్ని స్వామి అనుభవించటం ఈ రెండు విషయాల్ని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణము సుందరకాండలోని 15, 16 సర్గలలో నిక్షిప్తం చేసేరు. ఈ 15,16 సంఖ్యల శ్రీ విద్యావిషయంలో ఆ తల్లిని గురించి చెప్పే పంచదశి, షోదశి విద్యలకు ప్రతీకలు. ఆ విద్యాదర్శనం లలితా దర్శనమే.
ఈ సర్గలలో సీతాదర్శనము- లలితాదర్శనమే. అందుకనే సుందరకాండనంతను పారాయణ చేసే అవకాశం లేనివారు 15వ సర్గ చివర వరకు చేసినా సుందరకాండ పారాయణ చేసిన ఫలితం దక్కుతుంది. 15, 16 సర్గలను పారాయణ చేసినా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. పారాయణను చేసేటప్పుడీ భావన మాత్రముండాలి. అటువంటి సీతను చూసిన స్వామికి-
సముహూర్తమివ ధ్యాత్వా బాష్పపర్యాకు లేక్షణః
సీతామాశ్రీత్య తేజస్వీ హనుమా న్విలలాపహ.
కంటనీరు పెట్టుకొని ఏడ్చేడట. మహర్షి ఏడ్చేడని అనలేదు. ఏడుస్తూన్నట్లున్నాడట. ఇది భగవద్దర్శనమైన తరువాత స్థితి. ఇది ఏడుపు కాదు. అవ్యక్తానందం. అందుకే కంటి వెంట బాష్పములు. ఇక్కడ భ్రాంతి లేదు. భ్రాంతిలో గంతులు. స్వస్థితిలో ఆనందం ఇప్పుడు స్వామి స్థితి ఇది.
మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా
యది సీతా‚పి దుఃఖార్తా కాలో హిదురతిక్రమ్
లక్ష్మణునకు గురువైన రామచంద్రమూర్తికి ప్రియురాలైన సీతాదేవియే దుఃఖం వలన ఆర్తురాలయితే కాలం దాట రానిది కదా! దానికి అందరూ లొంగవలసినదే కదా!
ఇక్కడ- వీనీతుడయిన అంటే సామీప్యమును పొంది ఉన్న శేష లక్షణం కల లక్ష్మణునకు గురువుఅయిన అంటే పరబ్రహ్మతత్త్వమయిన శ్రీరామునకు గురుప్రియా అత్యంతము ఇష్టురాలయిన పరాశక్తి రూపమైన సీత- అని భావము. అట్టి తల్లియే ‘‘దుఃఖార్తాయది’’ దుఃఖార్త అయితే- అంటే కాలేదనే భావం. ఇదీ బాధ- ఇదీ ఆనందం- రెంటియందు బాష్పములు. సరే-
ఆలోచిస్తున్నాడు. నిజాలు తెలుస్తున్నాయి.
ఈమెవలన కదా! మహావీరుడైన వాలి మరణించేడు
ఈమె వలన కదా! చతుర్థశ సాహస్రకమైన సైన్యంతో ఖరదూషణాదులు మరణించేరు. ఈమె నిమిత్తంగానే కదా! సుగ్రీవునకు వానర దుర్లభమైన ఐశ్వర్య ప్రాప్తి కలిగింది- అంతెందుకు-
సాగరశ్చమయా క్రాంతః శ్రీమాన్ నదనదీపతిః
అస్యాహేతో ర్విశాలాక్ష్యాః పురీచేయం నిరీక్షితా.
విశాలాక్ష్యే నమః అని లలితా స్తుతి. అంటే-
తన కటాక్షమునకు పాత్రముకాదగినవాడు ఎక్కడ ఉన్నా తన దృష్టిని అంతవరకూ ప్రసరింపజేసి దృఙ్మత్రము చేతనే వానిని రక్షించునది. కనుకనే- ఈమె అనుగ్రహం వలననే కదా! నదనదీపతి అయిన సాగరుణ్ణి నేను దాటేను. లేకుంటే యిది నా ప్రజ్ఞ! అనుకొన్నాడు. అందుకే అక్కడ సురసను చూసి ‘‘దాక్షియణి నమో‚స్తుతే’’అన్నాడు. అంటే- ఇంతమందీ ఆ తల్లిని ఉపాసించిన వాళ్ళే అన్నమాట.
ఇంకావుంది...