Others

యోధుడు ఎలా ఉండాలంటే...10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న. ఏకలవ్యుని కులం మరియు కుటుంబం యొక్క నేపథ్యం కాకుండా ఇతర బలమైన కారణాలు ఏమైనా ద్రోణాచార్యులకు ఉన్నాయా?
ప్రొఫెసర్ డి.నికొలస్ మాటల్లో ‘‘యోధుడు యుద్ధం చేయటానికే కాక తన ప్రాణాలను సైతం ధారపోయడానికి సిద్ధంగా ఉండాలి.’’ ఒక యోధునికి ప్రతిదీ ప్రాణానికి అపాయం కలిగించేదే. ప్రతి తలుపు, ప్రతి పొద, ప్రతి కొమ్మ వెనుక ప్రమాదం పొంచి ఉంటుంది. కానీ ఆ ప్రమాదంలో చిక్కుకోవడానికి యోధుడు సిద్ధంగా ఉండాలి’’. వర్తమాన కాలంలో సైన్యంలో చేరదలుచుకున్న వ్యక్తి ఎటువంటి ప్రమాదకరమైనా పరిస్థితిని ఎదుర్కోడానికి సిద్ధమేనని పత్రంపై సంతకం చేయవలసి ఉంటుంది.
ఏకలవ్యుడి సామర్థ్యాలపట్ల గట్టి నమ్మకం ఉన్నా, అతని వల్ల తనకి, తన పరివారానికి, తన చుట్టూ ఉన్నవారికి అపారమైన ప్రమాదాలు పొంచి ఉన్నాయని తెలసి కూడా, అతని కోర్కెను మన్నించడం ద్రోణాచార్యులకు సరియైన మార్గమా? ఇటువంటి కారణాల వల్లే కర్ణునికి అస్తవ్రిద్య నేర్పడానికి ద్రోణాచార్యులు నిరాకరించాడు. ఏకలవ్యుని బొటనవ్రేలిని గురుదక్షిణగా అడగడం అమానుషం. విలువిద్యలో అర్జునుడు తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలన్న ఉద్దేశ్యమే ఈ కోరిక వెనుక దాగి ఉన్న కారణమని కొందరు వాదిస్తారు. ఇది ఒక కారణమే కావచ్చు కానీ మరికొన్ని ఆధారాలు పరిశీలిస్తే ఆ వ్యక్తి తన కుమారుడైనా గాని అతని వ్యక్తిగత శ్రేయస్సు కంటే ద్రోణాచార్యునికి సామాజిక శ్రేయస్సే ముఖ్యమని సూచిస్తోంది.
ద్రోణాచార్యులు మహాశక్తివంతమైన, సర్వనాశన కారి అయిన బ్రహ్మాస్త్రాన్ని బ్రాహ్మణుడు అయిన తనకొడుకు అశ్వత్థామకి కాకుండా క్షత్రియుడైన అర్జునునికి యిచ్చాడు. ఎందుకంటే అంత శక్తివంతమైన అస్త్రం తగిన సమయాల్లోనే ఉపయోగించాలన్న వివేకం మరియు నిగ్రహం గలవాడు కనుక అర్జునునికి ప్రాముఖ్యత యిచ్చాడు. ద్రోణాచార్యుడు తన కుమారునికి అస్త్రప్రయోగం మాత్రమే నేర్పించాడు కానీ దాని ఉపసంహారం నేర్పించలేదు. కానీ తన పక్షం వారిని రక్షించుకోవడానికి సర్వనాశనకారి అయిన అస్త్రాన్ని ఎలా ఉపసంహరించడమని తెలియకపోతే అది వ్యర్థమే అవుతుంది. ఆ విధముగా తన స్వప్రయో జనాల కంటే మానవ కళ్యాణమే ముఖ్యమనే భావనని ప్రదర్శించాడు. యుద్ధం ప్రారంభం కాక ముందు ప్రాణనష్టం జరుగుతుందని యుద్ధం చేయడానికి నిరాకరించినప్పుడు అర్జునుని క్షమత పట్ల ఉన్న అతని విశ్వాసాన్ని నిర్థారణ చేసింది.
ద్రోణాచార్యుని వివేచనాశక్తి మరియు ఉద్దేశాలను శంకించి ప్రశ్నించేవారు, అస్త్రాలు మరియు వాటి వల్ల కలిగే అపాయం గురించిన జ్ఞానంలో అతనితో సమానంగా లేక అతని కంటే అధికులని నిరూపించుకోవాలి. ఎందుకంటే అర్జునునిపై సరియైన గుణశీలాల నిర్ణయం చేసిన అతని మేధస్సు, మానవజాతి కళ్యాణానికే అది ఉపయోగపడాలన్న అతని సంకల్పం మరియు వ్యక్తిగత ప్రయోజనాల కంటే మానవకళ్యాణం ముఖ్యమని భావించే త్యాగగుణం కలిగియుండాలి.
తన శిష్యులు గొప్ప యోధులు అయ్యేలా శిక్షణ ఇచ్చే గురువు లేదా ఆచార్యుడు ద్రోణాచార్యులు.
అతను కవిత్వం లేదా తత్త్వశాస్త్రం యెక్క బోధకుడు కాదు. అతను ఒక సైనిక క్రమశిక్షణతో కూడిన సైనికుడు. సైనిక సంకేత భాష మరియు కఠినత్వానికి గల కారణాలను అర్థం చేసుకోవడం, సైన్యానికి బయట ఉండే వ్యక్తులకు కష్టం. ఎందుకంటే వాటి గురించి సైన్యానికి, బయట ఉండే వ్యక్తులకు బహిరంగ పరచవలసిన అవసరం లేదు. క్రమశిక్షణారాహిత్యంతో వ్యవహరించే విధానాలు మరియు శిక్షలు పౌర విభాగం కన్నా సైనిక విభాగంలో చాలా వేరుగా ఉంటాయి. ఉదాహరణకు ఒక సంస్థలో ఒక ఉద్యోగి సమావేశానికి ఆలస్యంగా వెళితే, మె4దటిసారి అతను లేదా ఆమె మీద ఎలాంటి చర్య తీసుకోరు. తక్కువ సమయంలో ఇలా పలుమార్లు జరిగినా, సంస్థ ఎలాంటి క్రమశిక్షణ చర్య తీసుకునే ముందు తాము ఏర్పాటు చేసుకున్న విధానాలు అంటే, నచ్చ చెప్పటం, తరువాత వ్రాతపూర్వక హెచ్చరికలు ఇవ్వడం పాటించాలి, ఇది కొంతమంది కలిపి ఆలస్యానికి గల కారణాలను ఉద్యోగి నుండి నేరుగా విని, తీసుకునే చర్య. ఇది జరగడానికి నెలల సమయం పడుతుంది.

సైన్యంలో ఒక శిక్షణార్థిఉదయం కవాతు కోసం 5 నిముషాల పాటు ఆలస్యమైతే, అతని యెక్క పై అధికారి అతనిని 8 లేదా 10 మైళ్ళు పరుగెత్తమని శిక్ష వేయవచ్చు. కఠిన శిక్షకు కారణాలు చాలా ఉన్నాయి. శిక్షణార్థి మళ్ళీ అదే తప్పు పునరావృతం చేయకూడదు. ఈ శిక్ష చూసిన ఇతర శిక్షణార్ధులు ఆలస్యం చేసేసాహసం చేయరు. వారు అర్థం చేసుకోవలసింది, యుద్ధం మరింత కఠినమైన పరిస్థితులను తెస్తుంది. పైఅధికారి ఆ శిక్ష వేయడానికి ఎలాంటి సైనిక నియమాన్ని ఉల్లంఘించకపోతే, అతని చర్యలు సమర్థనీయం.
ఒకవేళ ద్రోణాచార్యుడు, నిస్సహాయంగా ఉన్న, హానిచేయని ఒక కుక్కను చంపడం అనేది ఆ కాలంలోని సైనిక నియమం లేదా ధర్మానికి వ్యతిరేకం అని నిశ్చయిస్తే, వారికి కఠినమైన శిక్ష వేగంగా అమలు చేయడం అవసరం అనుకుందాం. అతను ఆ శిక్ష వేయకపోతే, అతను చూసిన వాటి కన్నా దారుణంగా, తనను తాను ఆ చర్యలకు బాధ్యునిగా కనుగొంటాడు, కేవలం చర్చ కోసం, ఆ కుక్క యజమాని ఉన్నారని, సమీపంలో నిలబడి ఉంటే దాని పర్యవసానం ఊహించండి, ద్రోణా చార్యులు అర్జునుడిని అత్యుత్తమ యోధునిగా చేస్తాననే మాట ఇవ్వడం వల్ల ఇలా చేస్తున్నాడనే ఒక పోటీ వాదనను ఇప్పుడు మనం పరిగణనలోకి తీసుకుందాం. పైన పేర్కొన్న వాదన చాలా బలహీనంగా ఉంది. ఎందుకంటే ఈ భావన ప్రకారం ద్రోణాచార్యుడు విశ్వాసం, ఏకలవ్యుని అంత సామర్ధ్యం ఉన్న యోధులు ఎవరూ లేరు అని. అందువల్ల, ద్రోణాచార్యులు అతడిని శక్తి హీనుడిని చేస్తే, అర్జునుడికి తను ఇచ్చిన వాగ్థానాన్ని నెరవేర్చగలడు అని వారి వాదన. ద్రోణాచార్యుడు ఆ సమయంలో తెలియని శత్రువు వైపు నిలబడిన యోధుల సామర్ధ్యాలను తక్కువగా అంచనా వేసేటంత తెలివితక్కువవాడు కాడు. వేలాదిమంది కర్ణులు వచ్చినా కూడా పాండవులను గెలవలేరని శ్రీకృష్ణుడు దృతరాష్ట్రునికి చెప్పాడనేది గమనించదగిన ముఖ్య విషయం. ఏకలవ్యుడు ఏ విధంగానూ కర్ణునికి సరితూగడు.
ఈ పరిస్థితికి ఒక దృక్కోణం ఉంది. ద్రోణాచార్యుడు, భీష్ముడు లేక కృపాచార్యుడు దుర్యోధనుని ఆజ్ఞలను పాటించడానికి బద్ధులై ఉన్నారు కానీ వారి సలహాలు పాటించాల్సిన అవసరం అతనికి లేదు. ద్రోణాచార్యుడు కేవలం అధికారుల సూచనలను అనుసరిస్తున్నాడని మనము నమ్మినటెఖ్లితే, అప్పుడు పై అధికారి అయిన దుర్యోధనుడు ఏదైనా మతపరమైన నియమాలు అనుసరిస్తున్నాడా లేక కేవలం తన స్వప్రయోజనాలేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాజరికం, ఏకపక్ష పాలన, బహుపక్ష పాలన లేక నియంతృత్వం గాని పాలకుని ప్రదమ లేక మె4ట్టమె4దటి ఆసక్తి వారికి అనుకూలమైన శాసనాలు స్వీకరించడంలో లేక వారికి అనుకూలమయ్యేటట్లు శాసనాలు చేయడంలో ఉంటుంది. అవసరమైతే మతపరమైన నియమాలని ఉల్లంఘిస్తారు. పాలకులు తమ స్వప్రయోజనాల అంశాన్ని నిర్లక్ష్యం చేయలేరు.

ఇంకావుంది...

డా॥ గరికపాటి ఆనంద్ 9966059562