Others

హనుమ - శీలము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నా దృష్టి పరస్ర్తి సుఖాదులందాసక్తము కాదు. అయిననూ నాకు ఎట్టి దుష్ట్భావన కలుగలేదు’’ అని-
‘‘మనోహి తేతుస్సర్వేషా మింద్రియాణాం ప్రవర్తనే
శుభాశుభా స్వవస్థా సుతచ్యమే సువ్యవస్థితమ్’’
మనసే కదా అన్ని ఇంద్రియములను నిర్దేశించునది. అట్టి మనస్సు నా యందు చలించక స్థిరముగానున్నది. ఎప్పుడైనా స్ర్తిలను స్ర్తిలలోనే కదా వెతుకవలసినది అని జితేంద్రియడైన హనుమ తలపోసెను. నాలుగంగుళములు కూడా విడువక గాలించి చూచాను జానకీమాత ఎక్కడనూ కానరాలేదు, రాక్షస బాధలు భరించలేక మరణించియుండునా, అమ్మ ఆచూకీ తెలుసుకొనక యే విధముగా తిరిగివెళ్ళి వానరులను కలుసుకొనెదను? గాన నిచ్చటనే ప్రాయోపవేశము చేయుదునే అని పరి పరి విధముల విచారించసాగెను. ఏ కార్య సాధకునికైననూ నిరుత్సాహము పనికిరాదని, ఉత్సాహమే సకల జయములకూ మూలమని బుద్ధిమంతులైన హనుమ భావించెను.
శ్లో అనిర్వేదః శ్రీయోమూ మనిద్వేదః పరం సుఖమ్
అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తకః
కరోతి సఫలం జంతోః కర్మ యత్తత్ కరోతిసః
తస్యాదనిర్వేదకృతం యత్నం చేష్టేహ ముత్తమమ్
ఉత్సాహమే మనుజునికి అన్ని కార్యములలో జయము చేకూర్చునది. కనుక ఉత్సాహ పూర్వకముగనే ఉత్తమమైన ప్రయత్నమునే కొనసాగించెదరని ధీరుడైన హనుమ, రావణ రక్షిత లంకలోనున్న ప్రదేశములను వెదకెదనని నిర్ణయించుకొనెను. ఈ రీతిగా నిరంతరము ఔత్సాహికులై జీవించవలెనని మానవాళికి ఒక నిర్దిష్టమైన సందేశానిచ్చాడు స్వామి.
నిరుత్సాహము మనిషిని అనేక రకములుగా కృంగదీసి, దుఃఖములకు కారణహేతువవుతుంది. యుద్ధ్భూమిలో జవాను నిరుత్సాహపడితే తాను పరాజయము పొందుటకుగాని శత్రువుల చేతిలో చిక్కటంగాని జరుగుతుంది.
అందుకే స్వామి వివేకానంద చెప్పినట్లుగా ‘్ఫయర్ ఈజ్ ఈక్వెల్ టు డెత్’. నిరుత్సాహము మరణముతో సమానము.
ఎల్లప్పుడూ ఎవరైతే ధైర్యంగా సమస్యలను ఎదుర్కొనగలరో జయము వారినే వరిస్తుంది. ఒక విద్యార్థి పరీక్షలో ఉత్తీర్ణుడు కాకపోతే నిరుత్సాహపడి చివరకు అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. అట్లుగాక ధైర్యంగా ఎదుర్కొని తిరిగి పరీక్ష వ్రాసి ఉత్తీర్ణత పొందవచ్చు. అదే ఉత్సాహవంతుల లక్షణం. ‘సక్సెస్ ఆఫెన్ కమ్స్ హూ డేర్స్ టు యాక్ట్’ అనే సామెత చాలామందికి తెలిసే వుంటుంది. చాలామంది రాజకీయ నాయకులు ఒకచోట ఎన్నికలలో ఓడినవారు, మరొక చోట జయము పొందుతూ వుంటారు. దీనికి కారణం వారు ఓడినందులకు విచారపడకుండా, దైన్యంతో క్రుంగిపోకుండా ఉండడమే అదేవారి జయమునకు దారితీస్తుంది. అదే స్వామి లోకానికి తెలియజేసిన సందేశము.
హనుమ తత్వంలో అతి ముఖ్యమైన అంశం సేవాతత్వం. శ్రీరామచంద్రమూర్తికి నమ్మినబంటు, ఆయన పాదసేవకుడు. అశోకవనములోనున్న సీతామాతను చూసి, శ్రీరామ ప్రభువు చెప్పిన గుర్తులను బట్టి ఆమె సీతయే అని నిర్ణయించుకొన్న తరువాతనే-
రోష ప్రముకై రిషుభిర్జ్వలద్భిరివ పావకైః
తేనాహం ప్రేషితో దూతస్త్వత్సకాశ మిహాగతః
రామ రావణ యుద్ధమందు మండుచున్న అగ్నివంటి బాణములతో రావణుని వధించగల శక్తిమంతుడైన శ్రీరామునిచే పంపబడిన దూతగా నీ వద్దకు వచ్చితిని అని ఎంతో నిరాడంబరత్వముగా స్వామి పలికిన పలుకులు, ఇంకనూ నేను సుగ్రీవుని మంత్రిని హనుమంతుడను వానరుడను, ఈ మహా సముద్రమును దాటి లంకలో ప్రవేశించితిని అని ఏ రకమైన అహంకామూ లేక మాట్లాడిన మాటలు సీతా మాతను ఊరడింపజేసినవి. మానవునకు సహజమైన అహంభావము, ప్రలోభములను పక్కకు నెట్టగల ధైర్యము, సామర్థ్యము గల దూతలు తమ కార్యమును జయప్రదముగా సాధించగలుగుతారు. అటువంటి ధృతిమతిగల హనుమని సుందరకాండ ద్వారా తెలియబరిచినాడు మహర్షి.

- సమాప్తం

లక్కరాజు వెంకట పూర్ణచంద్రరావు