Others

‘చదువులతల్లి’కి చక్కటి కానుక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాళ్లు-రప్పలు.. వన్యప్రాణులు-విష కీటకాల సంచారం.. భీతి గొలిపే అటవీ ప్రాంతం.. అయినా ఎలాంటి భయం లేకుండా ఆ బాలిక రోజూ రెండు గంటల పాటు ఒంటరిగా నడుస్తూ బడికి చేరుకొంటుంది.. బాగా చదువుకొని డాక్టర్‌గా నిరుపేదలకు సేవచేయాలన్నదే ఆ ‘చదువుల తల్లి’ సంకల్పం.. అందుకే- ఆ సంకల్ప బలం ముందు ఎలాంటి కష్టాలనైనా ఆమ అనాయాసంగా ఎదుర్కొంటూ బడిబాట పట్టింది.. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు కావడంతో ఎలాంటి రవాణా సౌకర్యానికి నోచుకోక ఆమె అటవీ ప్రాంతం గుండా నడుచుకొంటూ బడికి హాజరవుతోంది. మహారాష్టల్రోని రాయ్‌గఢ్ జిల్లా పల్చిల్ గ్రామంలోని శాంతారామ్ శంకర్ జాదవ్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న నిఖితాకృష్ణ మోరె రోజూ ఉదయం 8-45 గంటలకు నడక ప్రారంభించి కొండలు, గుట్టలు ఎక్కుతూ పాఠశాలకు చేరుకొంటుంది. శనివారం నాడైతే ఒంటిపూట బడి కావడంతో ఉదయం 8 గంటలకే ఇంటినుంచి బయలుదేరుతుంది. చదువులో రాణించి డాక్టర్ కావాలన్న పట్టుదలతో ప్రతిరోజూ 14 కిలోమీటర్ల మేరకు నడుస్తుంది. బడికి వెళ్లేందుకు తమ కుమార్తె ఇంతటి కష్టాలు పడుతున్నా నిరుపేద తల్లిదండ్రులు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. చదువుపై ఇంతటి ఆసక్తి, అనురక్తి ఉన్న నిఖిత గురించి స్థానిక దినపత్రికలో వచ్చిన వార్తాకథనాన్ని చదివి పూణెకు చెందిన ‘సిటీ కార్పొరేషన్’ మేనేజింగ్ డైరెక్టర్ అనిరుద్ధ దేశ్‌పాండే చలించిపోయారు. వెంటనే ఆయన నిఖితను, ఆమె తల్లిదండ్రులను, పాఠశాల హెడ్‌మిస్ట్రెస్‌ను పూణెకు పిలిపించారు. బడికి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు నిఖితకు ఎలక్ట్రిక్ సైకిల్‌ను దేశ్‌పాండే అందజేశారు. రెండు గంటలు ఛార్జింగ్ చేస్తే వంద కిలోమీటర్ల వరకూ ఈ సైకిల్‌పై వెళ్లవచ్చు. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ సైకిల్‌ను అందుకున్నాక నిఖితలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. బడికి వెళ్లేందుకు ఇపుడు ఎలాంటి సమస్యలు లేనందున చదువుపై మరింత దృష్టి సారిస్తానని ఆమె చెబుతోంది. ఇంతటి సాయం అందుతుందని తాను కలలో కూడా ఊహించలేదని ఉబ్బితబ్బిబ్బయింది. నిఖిత గురించి తెలుసుకొని కొధ్రూడ్‌కు చెందిన ఉన్నతోద్యోగి విద్వత్ ప్రకాశ్ చిత్రే మరో సైకిల్‌ను నిఖితకు అందజేశారు. నిఖిత ఎంతో ప్రతిభావంతురాలైన విద్యార్థిని అని, బడికి వచ్చేందుకు ఎన్ని సమస్యలున్నా ఎవరితోనూ చెప్పేది కాదని పాఠశాల హెడ్‌మిస్ట్రెస్ వినీత పవార్ గుర్తుచేస్తున్నారు. చదువుపై తప్ప ఇతర విషయాలపై ధ్యాస లేని నిఖిత మిగతా విద్యార్థులందరికీ స్ఫూర్తి కలిగించిందని ఆమె ప్రశంసలు కురిపించారు.