Others
ఎంగిలి మెతుకులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ముఖాముఖి అంటే
నరాలకు సూదులేసినట్టుంటుంది
అందుకే నా బాల్యాన్ని
నా ముందు కూర్చోనివ్వను...
నా పాదముద్రల వెంట
ఆమె ఎందుకు వెంటపడుతోందో..
అయోమయం
ఎక్కడో ఆకాశంలో ఉన్నవాడికి
నాపై ఎందుకంత కోపమో?
వెంటాడుతూనే ఉండేవాడు...
నా కడుపులో ఎవరో
కత్తులేసి కోసినట్టు ఉండేది;
పరిస్థితిని అర్థం చేసుకోలేనిది
అదా; నేనా!
సంహరించాలనిపిస్తుంది..
మేఘాలు గుద్దుకున్నప్పుడో
నీటిలో అగ్గి చెలరేగినప్పుడో
మా ఇంటి ముందున్న
టెంకాయచెట్ల నడుములు
ఇంటికప్పుపై వాలుతుంటే
అమ్మమ్మ కళ్లలో దీపం కదిలేది...
వీధిలో విసిరేసినట్టుండే మా ఇల్లు
ఒక అనాధ పక్షి కట్టుకున్న
గూడులా అనిపించేది...
పేగులు శబ్దం చేస్తున్నా
ఆత్మాభిమానం
ఇంటిగడప దాటేది కాదు...
తొడలపైకున్న నిక్కర్ని చూసి
మసీదు నన్ను వెలేసింది
ఒక కాగితాన్ని నా పిడికిలో బంధించగానే
చెంపలపై నదులు కదులుతాయ
అందులో ఏముందో తెలిసేది కాదు
మరుసటి రోజు బడి మరణిస్తుంది...
వాళ్లమ్మకు తెలియకుండా
పక్కింటి జయ నా దోసిళ్లలో పెట్టె
ఎంగిలి మెతుకులు నాకు అమృతం
కడవలోని నీటిని తాగాలన్నా
కనురెప్పలు విరిగిన శబ్దం;
గుండెల్లో ఒణుకు పుట్టించేది...
అందుకే నేనెప్పుడూ నా బాల్యాన్ని
ఎదురుగా కూర్చోబెట్టుకుని మాట్లాడను
కానీ నేడెందుకో బాల్యాన్ని
అక్షరీకరించాలనుకున్నా...
ముసలి ఆవు నోట్లో
మేత నెమరేస్తున్న శబ్దం వినగానే
లోపలో బయటో
ఊపిరి బందీ అవుతుంది