Others
విశ్వానుభూతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
చలి అందరికీ
ఒకే తీరుగ వుండదు
ఎండలాగే
వ్యక్తి పరిస్థితి కన్నా
లోకగతి ముఖ్యం మనకు
ఏ అతినైనా ప్రతిఘటిస్తాం
వ్యతిరేకిస్తాం
అవసరమైతే పోరాటం సాగిస్తాం
ఎవరో
వెన్నుదన్నుగా ఉండాలని కాదు
మనకు మనమే ధైర్యం
కష్టాలు అందరికీ
ఒకే తీరుగ వుండవు
కొందరి కష్టాలు
నిజంగా కష్టాలే అయతే
అవి మనందరివి కూడా.
సుఖాల గుట్టు తెలిసి
కష్ట నివారణ కోసం
అందరిదారి పట్టిన తేజోమూర్తులకు
మోకరిల్లక తప్పదు
మనస్సు అందరికీ
ఒకే తీరుగ వుండదు
తవ్వగా తవ్వగా
అడుగున తగిలే మనిషి మాత్రం
అందరికీ అందుతాడు
ఆ ఒక్క క్షణమే
విశ్వానుభూతికి చేరువౌతాం.
అనుభవాలూ అంతే!
స్వీయమనే లోయలోంచి పైకెగబాకితే
సూర్యుడు దొరక్కపోడు
అతని వేడికీ
నరాల్లోని ఉష్ణరక్త ప్రవాహానికీ
లంకె కుదిరినప్పుడు
మార్పు ప్రారంభవౌతుంది.
మార్పే
కొత్త చేర్పును ప్రసాదిస్తుంది.