Others

ఆ...అమ్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ... అమ్మ! తన కడుపు
దీపాన్ని ఆరిపోకుండా
నెత్తుటి అక్షరాల సరస్సుపై నిలబడి
గుండె నిండా సూర్యుడి కిరణాలను
నింపుకుని
కన్నీటి చుక్కలతో జీవిత పుస్తకంపై
సంతకం పెడుతూనే వుంది

అమ్మా! అనే పిలుపు
శిథిలమవుతున్న భావనతో
హృదయం మాయని గాయంలా
అనుక్షణం అణువిస్ఫోటనం చెందుతూ
మృత్యుకుహరంలో దాగిన ఆ పసిప్రాణాన్ని
కాపాడుకోవాలన్న తపన.. తన ఊపిరిని
అగ్ని శిలలపై నిలుపుకుంటుంది

ఇది అనువంశికమో? లేక
కాలవిస్ఫోటనమో?
తెలియని మా రక్తరోగం
దేహం పసుపుపచ్చని రంగులోకి
మారుతున్నప్పుడు
పాలిపోతూ నిస్సత్తువకు గురౌతూనే
వుంటుంది
ప్రతి 3పక్షం2 రోజులకే 3రెడ్ బ్లడ్‌సెల్స్2 కోసం
అర్రులు చాస్తూ విలవిలలాడుతూనే
వుంటుంది
మర్మం తెలియని ఆ పసిదేహం

పనె్నండు నెలల వయసులోనే
రకరకాల రక్తపరీక్షలకు గురై
హెచ్.డి. ఎలక్టోఫ్రేసిస్ అనువంశిక పరీక్షతో
3బ్లడ్ డిజార్డర్..2 ఆర్.బి.సి. అబ్నార్మల్‌గా తేలి
3బీటా తలసేమియా మేజర్2గా
గుర్తించబడ్డ వెంటనే
ఆ.. అమ్మ.. మానసికంగా ఉరితాడు మీద
శిలగా మారి
అశ్రుధారల చీకటి దుప్పటిని
కప్పుకుంటుంది

ఆ రోజు నుండి తన మమతని
హృదయ కవాటాల్లో దాచుకుంటూ
రక్తదాతల వెంట పరుగెడుతూనే వుంది

ఆ.. అమ్మ! సమాధవుతున్న ఆశయాలను
హృదయ పునాదుల్లో దాచిపెడుతూ
రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడసాగింది
ప్రతిక్షణం తన మమతని విడనాడక
అనుక్షణం అర్థంకాని వైద్యం వెంట
పరిగెడుతూ
3బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్లు2 ఐరన్ ఛెలేషన్లతో
3స్ల్పీనెక్టమీ2 ద్వారా.. ఆ పసికందును
పది వసంతాలు దాటిచ్చినా
ఇక ముందు దాటిచ్చని కడు పేదరికం
ఆమె చెంత నిలబడి అపహాస్యం
చేస్తూనే వుంది

ఆ.. అమ్మ మాయని గాయంతో
మమత కోసం ప్రతి సవాళ్ళను
స్వీకరిస్తూ
జీవచ్ఛవంలా మారిన ఆశలను
పునరుజ్జీవింపజేయడానికి పడుతున్న
సంఘర్షణ
దారితప్పిన కాలాన్ని దోసిట్లో బంధించే
ప్రయత్నంగా
జవసత్వాలు తొడిగిన సూర్యుడిలా
అగుపిస్తున్నాయి..
(తలసేమియాతో బాధపడుతున్న పిల్లల తల్లులకు సానుభూతిగా)

- మహ్మద్ నసీరుద్దీన్, 9440237804