Others

భారీ క్యాబేజీ-పాప..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొమ్మిదేళ్ల బాలిక భారీ క్యాబేజీని పండించి 32 వేలమంది పిల్లల్లో విజేతగా నిలిచింది. అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన లిల్లీ రీస్ అనే పాప స్థానిక ఎలిమెంటరీ పాఠశాలలో చదువుతోంది. అక్కడ ఏటా జరిగే నేషనల్ బోన్నీ ప్లాంట్స్ క్యాబేజ్ ప్రోగ్రామ్‌లో లిల్లీతో పాటు మరో 32 వేల మంది పిల్లలు పాల్గొన్నారు. లిల్లీ తన తల్లిసాయంతో క్యాబేజీ మొక్కను పెంచడం మొదలుపెట్టింది. అయితే అది సాధారణ క్యాబేజీలా కాకుండా అది అంతకు అంతగా పెరుగుతూ ఓ పెద్ద పువ్వులా తయారైంది. ఈ క్యాబేజీని చూసిన ప్రోగ్రామ్ అధికారులు ఎంతో ఆశ్చర్యపోయారుట. అంతేకాదు లిల్లీకి వెయ్యిడాలర్లు నగదును అంటే మన కరెన్సీలో రూ. 70వేలు బహుమతిగా అందించారు. అయితే ఈ క్యాబేజీతో లిల్లీ తల్లి సలాడ్‌ను తయారుచేసింది. ఇంటిల్లిపాది తిన్నా కూడా ఆ సలాడ్ ఇంకా అయిపోలేదు. దాంతో తమ గార్డెన్‌లో పెంచుకుంటున్న కుందేళ్లకు ఆహారంగా పెట్టినట్లు లిల్లీ చెప్పింది. ఏదేమైనా ఈ క్యాబేజ్ ఫొటో మాత్రం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.