Others

రేపటినుండి ధర్మభూమిలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమాన్ గన్ను కృష్ణమూర్తిగారు చతుర్భుజులు..
పంచముఖులు.. బహుగ్రంథపఠనం,
నవ్యరచనా ధౌరంధర్యం, ప్రాచీన వాఙ్మయ రహస్య
మూల్యాంకన చణత్వం, విద్వజ్జన శ్లాఘావశీకరణం..
ఇవి ఆయన చతుర్భుజత్వాలు. అంతేకాదు ఆయన భావుకుడు,
మంచి విమర్శకుడు, ఉపన్యాసకుడు, కవి, తాత్త్వికుడు..
ఇలా ఎన్నో.. ‘కవిత్వం.. తీరని దాహం’
అన్న శ్రీశ్రీ మాటలకు వంత పాడుతూ కవిత్వ దాహాన్ని తీర్చుకోవడానికి
చిన్ననాడే పెన్ను పెట్టారు గన్ను కృష్ణమూర్తిగారు. ఎన్నో కథలను, కవితలను, గ్రంథాలను, కావ్యాలను రచించారు.
ఆయన రచనల్లో ఆలంకారికశైలీ శోభ ఉంటుంది.
ధ్వని శిల్ప చాతుర్యం ఉంటుంది.
భావశబలత, సౌందర్య గాంభీర్యాలు నిండారి ఉంటాయి.
‘సీత చేతిలో పూవైపోయాడు రాముడు.. పూవు గెండెను
పరిమళమ్మాయె సీత’..
ఎంతటి మనోజ్ఞ భావం కదా ఇది.. అపూర్వ భావనాశక్తికి,
గేయరచనా పటిమకు, కల్పనా రీతికి, కథా కథన శిల్పానికి సాక్ష్యమే..
గన్ను కృష్ణమూర్తిగారి2 గేయచంపువు,
అధిభౌతిక రామాయణమైన
శ్రీకృష్ణ రమ్య రామాయణం