Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారక
అది ద్వారకనగరమ్ము - అది ద్వాపర యుగాంతమ్ము
అలల లోన కలల తోడ - వెలసెనొక్క ద్వీపమ్ము

నగరమ్మే సాగరమన -అగుపించును ద్వారక
ఉరకల పరుగుల దేలెడు - నరులె తరంగాలనంగ

రత్నాకరు గర్భమ్మున -రత్న గర్భ ద్వారక
రతనాలకె వెలుగు నిడుచు - రాజ్యమేలు శ్రీకృష్ణుడు

ఒక సూర్యుడు తన వక్షం చీల్చి వెలుగునిచ్చునట్లు
ఒక అంబుధి తన రక్తం తోడ జగతి బ్రోచునట్లు

శ్రీకృష్ణుడు తన ఛత్రం
పట్టినట్టి నగరం

అతడే మా కృష్ణుడంచు అతడే మా విష్ణువంచు
అప్పురమే కప్పురమై హారతి అతని వ్రోల

వారల కాతడు ప్రాణం - వారలతని ప్రాణమ్ములు
ఒకరికొకరు ప్రాణమై - ఒకటై జీవింతురు

కష్టమనగ వారెరుగరు -కన్నీరుల నెరుగరు
ఇంటింటను క్షీరాంబుధి -అందు లక్ష్మి నివాసమ్ము

ఆ వీధుల వైశాల్యము నేమని పొగడంగ గలను?
శతకంఠుని రథమైనను సాగును అవలీలను

ప్రజలనెల్ల తన కౌగిట భద్రపరచునచటి కోట
చుక్కల చెక్కిలుల మీటుచుండు దాని శిఖరమ్ములు

కడలి గర్భమే పురమ్ము తలాతలమె పునాదులు
గగనమ్మే హర్మ్యమ్ము చుక్కలె హరిహద్దులు

ధైర్యమ్మే కోటగోడ స్థైర్యమ్మే బురుజులు
మంచితనమె మార్గమ్ము మానవతయె గమ్యము

ఏ వేళను ఏ క్షణమున -ఏతెంచునొ మాధవుండు
అంచువారు తెరచియుంత్రు కిటికీలను తలుపులను

తలపుల నెరుగుదురుగాని- తలుపులు వారెరుగరు
దానము నెరుగుదురు గాని- చౌర్యము వారెరుగరు

ఇంకావుంది...

-గన్ను కృష్ణమూర్తి