Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందమామలట్లు వెలుగునందలి సౌధమ్ములు
అందందున తళుకులీను అతివలె తారకలు

ఉవ్వెత్తున లేచి పడెడు ఒక పచ్చని సంద్రమట్లు
అప్పురమున వనములెల్ల నబ్బురమ్ము గొల్పును

సత్యభామ జడలట్టుల నర్తించును వల్లరులు
రుక్మిణమ్మ పూజలకై పోటీపడి పూయును

అతడే మా కృష్ణుడంచు అతడే మా విష్ణువంచు
అప్పురమే కప్పురమై ఆరతి అతని వ్రోల

మంత్రవౌచు, వీర్యవౌచు, విత్తవౌచు సేవచ
ఆ పట్టణమును గొల్చును చాతుర్వర్ణమ్ములు.

వర్ణములన వర్ణములే? ఆకులలో ఈనెల వలె!
వర్ణములన వర్గములే? సూర్యునిలో రంగుల వలె!

ఆ ఊరను ఎటు చూచిన అగుపింతురు గొల్లలు
కల్లకపటము నెరుగని మొల్లలు ఆ గొల్లలు

ఆ గొల్లల భామినులకు ఒడలెల్లను తొడవులు
తిరిగే బంగారు గనులు మెరిసిపోవు మెరపులు

ఆకాంతలు అచ్చరలనె వెక్కిరింప జాలుదురు
వారి పాద ధూళి కొరకు ఋషులే తపియింతురు

ఆ కృష్ణుని చక్రమనగ అట తిరుగును ఋతుచక్రం
అతని చేతి మురళివోలె అలరించును గాలి

బలరాముని నాగలికిని కట్టుబడిన వృషభమనగ
ద్వారకలో పట్టుబడిన ఇనుడు పంటలను గాచును

కాలూనుటకా పురమున కంపింతురు రక్కసులు
అటదిగి వాసము సేయగ అలమటింత్రు సురులు

దేవేంద్రునకైన ఈర్ష్య తెప్పించెడి వైభవమ్ము
నెలవు భోగభాగ్యములకు ఇలలో వైకుంఠము

భక్తికి పావనగంగ - రక్తికి సామ్రాజ్యము
శక్తికి పీఠవ్మౌను - ముక్తికి సోపానము
ఇంకావుంది...

-గన్ను కృష్ణమూర్తి.. 9247227087