Others

వసంత పంచమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(రేపు వసంత పంచమి సందర్భంగా...)

‘‘వసంత పంచమి’’గా పిలువబడే మాఘ శుద్ధ పంచమి ప్రధానంగా రుతు సంబంధ పర్వదినం. ఈదినమే చదువుల తల్లి ‘‘సరస్వతి జయంతి’’గా కొన్నిచోట్ల భావించబడుతుంది. దీనిని ‘‘ సరస్వతి పూజాదినంగా, శ్రీపంచమి, మదన పంచమి, రతి కామ దమనోత్సవ పర్వదినం’’గా పంచాంగ కర్తలు పరిగణిస్తారు. వసంత పంచమి నామాన్ని బట్టే దీనిని రుతు సంబంధమైనదిగా భావించవచ్చు. మకర సంక్రాంతి తరువాత ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. ఆకాలంలోనే క్రమంగా వసంత రుతు లక్షణాలైన చెట్లు చిగుర్చడం, పూలు పూయడం కనిపిస్తుంది. మాఘ మాసమే వసంతరుతువుకు ఆరంభమనే వాదనకూడా ఉంది. వసంతోత్సవారంభానికి వసంతి పంచమినే కొందరు పంచాంగ కర్తలు ఉదహరిస్తారు. రాగల వసంత రుతువుకు శిశిరంలోనే స్వాగతించే పండుగ ఇది. ఈనాటి కృత్యాలలో నూతన వస్తధ్రారణం, తైల స్నానాలు ప్రధానాలని చెప్పబడింది. నూతన వస్తధ్రారులై, బుక్కా, వసంతం చల్లుకునే పండుగ అయినందునే వసంత పంచమి అని నామాంకితయైంది. ‘‘నవాన్న భక్షణ దినం’’గా, సంక్రాంతికి వచ్చే ధాన్యాన్ని ఈరోజు అన్నం వండి కులదేవతలకు నివేదించి తినే ప్రాచీన ఆచారమూ కొన్ని ప్రాంతాలలో ఉన్నది. ప్రాచీన కాలంలో రోమనులు కూడా ‘‘వసంతరుతు పండుగ’’ను ఇదే రోజు, ఇదే మాదిరిగా చేస్తుండే వారని పేర్కొనబడింది. బ్రహ్మ వైవర్త పురాణంలో ప్రకృతి ఖండంలో నాలుగో అధ్యాయంలో అన్ని శక్తులలో ప్రధానమైన శక్తిగల సరస్వతిని వసంత పంచమినాడు పూజించాలని చెప్పబడింది. కనుక వసంత పంచమి ‘‘విద్యారంభ దినం’’. విద్యకు అధిదేవతయైన సరస్వతిని మాఘ మాసమందు తాటియాకులు, గంటము, గ్రంథములాది విద్యా సాధనములను దేవి ఎదుట ఉంచి గంధ పుష్పాదులతో గ్రంథ రచన ప్రారంభ సమయంలో పూజించే ఆచారం ఉండినట్లు సురవరం ప్రతాపరెడ్డి పేర్కొన్నారు.
సరస్వతీదేవి అహింసాదేవి. ఆయుధాలు ఏమీ ధరించని దేవత. తెల్లటి పద్మం మీద సరస్వతి నిలబడి ఉన్నట్లు, ఒకకాలు నిలువుగాను, మరొకకాలు దానిమీద అడ్డంగాను ఉంచుకుని, ఒకచేత వీణ, మరొకచేత పుస్తకము ధరించి ఉన్నట్లు పద్మ పురాణ లిఖితం. తెల్లటి బట్టలు ధరించి, తెల్లటి పూలు, తెల్లపూసల కంఠహారం, దానిపై తెల్లగంధం పూత, తెల్లని వీణాపాణితో కూడిన ప్రశాంత, శాంతి దేవత సరస్వతి. పూజా సందర్భంలో చదువుకు, వ్రాతకు, సంగీతానికి సంబంధించిన పరికరాలను ఆమె ముందుంచడం అనవాయితీ.
పసుపు పచ్చని బట్టలు ధరించి, సరస్వతికి రోజంతా పూజలు నిర్వహిస్తూ, కీర్తనలు పాడడం సనాతన సాంప్రదాయం. ఈనాడే రతీదేవి కామదేవత పూజ చేసినట్లు, రుతురాజు వసంతునికి కామదేవుడు మంచి మితృడైనట్లు, కనుక ఈనాడు ‘‘రతీ, మన్మద, వసంతుల పూజలు’’ చేయాలని పురాణ కథనం. రుగ్వేదంలో ప్రధానంగా గ్రీష్మ, శారద, వసంత కాలాలు మూడే పేర్కొనబడినాయి. వసంత పంచమి నాటికే మామిడి తదితర చెట్లు బాగా చిగురించి, పుష్పిస్తాయి. పనస మొదలైనవి పైరుగాలికి పిందెలుగా మారుతాయి. శీతాకాలపు పడిశాలు, దగ్గులాంటి రుగ్మతలు క్రమంగా తగ్గుతాయి.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494