AADIVAVRAM - Others

సేవకు ప్రేమే ప్రధానం.(రాస క్రీడాతత్త్వము-13)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపికల సందేహాలు :-
ఈ విధంగా శ్రీకృష్ణుడు గోపికలతో అటూ ఇటూ తిరుగుతూ, ఒక ఇసుక దిబ్బ మీద కూర్చున్నాడు. గోపికలంతా ఆయన చుట్టూ చేరి రక రకాలుగా సేవిస్తున్నారు.
(i) కొందరు తమ వల్లెవాటులను (పైన కప్పుకునే ఉత్తరీయం) తీసి స్వామికి ఆసనంగా వేశారు.
(ii) కొంతమంది చుట్టూతా చేరి, విలాసంగా ఆయన వంక చూస్తున్నారు.
(iii) కొందరు ఆయన పాదాలను తమ ఒళ్ళో పెట్టుకుని, చేత్ఱుతో మెల్లిగా వత్తుతున్నారు.
ఇలా కొంత సేపు జరిగాక, కొందరు గోపికలు స్వామికి ఒకింత కినుక చూపిస్తూ - ‘‘స్వామీ! కొందరు తమని భజించినవారిని ఆదరిస్తూ ఉంటారు. కొందరు తమని సేవించినా సరే- దగ్గరకు తీయరు. ఈ విపరీతానికి కారణమేమిటి?’’ అని అడిగారు.
స్వామికి గోపికల మాటలలోని అంతరార్థం అర్థమైపోయింది. ఎన్నో జన్మలనుంచీ స్వామిని సేవిస్తున్నా, ఆయనకు రవ్వంతైనా కృతజ్ఞత లేదనీ, దగ్గరకు తీసినట్టే తీసి మాయమైపోతున్నాడనీ, వాళ్ళు లోలోపలే వుడికి పోతున్నారు. దాన్ని కడుపులో దాచుకోలేక, సూటిగా చెప్పలేక, ఈ విధంగా ఎవరి మీదనో నెపంబెట్టి ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం గ్రహించిన స్వామి లోలోపల నవ్వుకుంటూ సూటిగా సమాధానం చెప్పాడు -
(i) చెలులారా! కొందరు సేవ చేయించుకుని దగ్గరకు తీస్తారు- అని మీరన్నారు. ఒకడు ఇంకొకడికి ఎందుకు సేవ చేస్తాడు? ఏదో ఒక ప్రత్యుపకారాన్ని ఆశించే, వాడు సేవ చేస్తాడు. చేయించుకునేవాడు ఎందుకు చేయించు కుం టాడు? ఆ సేవ లేకపోతే వీడికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే చేయించుకుంటాడు. అందువల్ల తనకు సేవ చేసేవాళ్ళు ఏమి కోరుకుంటున్నారో- అది ఇస్తాడు. ఇది లోక సహజం.
(ii) బాగా ఆలోచిస్తే ఇలా సేవ చేసేవాడూ, చేయిం చుకునే వాడూ, ఇద్దరూ స్వార్థపరులే. త్యాగం ఇద్దరిలోనూ లేదు. నిజమైన ప్రేమా లేదు.
(iii) ఇలాంటి వ్యాపారంలో ధర్మం ఏముంది? మనం ఆవుల్ని పోషిస్తున్నాం. మేకలను పోషిస్తున్నాం. అది త్యాగమా? ఇదీ అంతే. ఇక ‘‘కొందరు సేవ చేసినా దగ్గరకు తీయరు’’ - అన్నారు. ఇదెందుకూ అని అడిగారు. ఇక్కడ రెండు దృక్కోణాలున్నాయి. ఒకటి ఉపకారం చేసేవాడి దృక్కోణం. మరోటి ఉపకారం పొందేవాడి దృక్కోణం. ముందు చేసేవాడి గురించి చూద్దాం.
(iv) ఒకప్పుడు సేవ చేసేవారు ఏ ప్రత్యుపకారాన్నీ కోరకుండా చేస్తారు. అలా ఎందుకు చేస్తారంటే- దానికి రెండు కారణాలుండవచ్చు. ఒకటి - పరోపకారార్థం ఇదం శరీరం - అనే భావంతో ‘‘ఎదుటివాడికి ఉపకారం చేయటం నా ధర్మం, అంతే. దానివల్ల నేను ఏ రకమైన ప్రత్యుపకారాన్నీ కోరను’’ - అనుకుంటూ చేస్తారు.
(v) కొందరు అకారణమైన కరుణకు లోనై, వీడివల్ల నాకేం లాభం? అని ఆలోచించకుండానే ఎదుటివారికి ఉపకారం చేస్తూ వుంటారు. సామాన్యంగా తల్లిదండ్రులు ఇలాంటి పని చేస్తూ ఉంటారు.
(vi) ధర్మం అనుకుంటూ ఉపకారం చేసేవాళ్ళలో కరుణే ఉండదనీ, కరుణాబుద్ధితో చేసేవాళ్ళలో ధర్మచింతే వుండదనీ నేను చెప్పడం లేదు. ధర్మదృష్టితో చేసేవాళ్ళకు కరుణ అప్రధానం. కరుణ దృష్టితో చేసేవాళ్ళకు ధర్మం అప్రధానం.
(vii) ఇలా ధర్మదృష్టితో కానీ, కరుణదృష్టితో కానీ, నిస్స్వార్థంగా ఉపకారం చేసేవాళ్ళు ఎదుటివాడ్ణుంచి ఏమీ కోరరు కనుక, వారిని రెండవవాడు దగ్గరకు తీయవలసిన అవసరం లేదు.
(viii) ఇక రెండవ దృక్కోణం-ఉపకారం చేయిం చుకునేవాడి దృక్కోణం. వీరు నాలుగురకాలు. 1.ఆత్మారాములు, 2.పూర్ణకాములు, 3.అకృతజ్ఞులు, 4.కఠినులు- అని.
(ix) ఆత్మా రాములంటే - సర్వత్రా నేనే వున్నాను అనే భావనతో, స్వపర భేదం లేకుండా వుండేవారు. వీరికి ఎవరైనా ఉపకారం చేస్తే, వాళ్ళ దృష్టిలో రెండవ వస్తువు లేదు కనుక, వాళ్ళకేమీ పట్టదు. వారు దగ్గరకు తీసుకునేదీ లేదు, దూరాలకు తోసేదీ లేదు.
(x) పూర్ణకాములంటే-్భగవద్దర్శనంవల్ల భోగేచ్ఛలన్నీ తొలగిపోయినవారు. అందుకే వారికి ఒకర్ని దగ్గరకు తియ్యాల్సిన అవసరం లేదు.
(xi) నేను మాయమైనప్పుడు మీకు అలాంటి పరాభక్తి కుదిరింది.
(xii) ఆ సమయంలో మీ తియ్యటి మాటలన్నీ నేను చెవులారా విన్నాను.
(xiii) మీరు చేసిన సేవకు తగిన ప్రత్యుపకారం నేను ఎప్పటికీ చెయ్యలేను.
(xiv) మీ మంచితనమూ, మీ భక్తే మీకు ప్రత్యుపకారం చేస్తుంది. అదే నన్ను ఋణవిముక్తుడ్ణి చేస్తుంది - అని.
తేనెల సొనల వంటి ఆ మాటలు వినే సరికి గోపికల హృదయాలన్నీ శాంతించి, విరహబాధ తొలగి, అద్భు తమైన ఆనందం కలిగింది.
రాసక్రీడ :- ఆ సంతోష సమయంలో గోపికలకు ఆనందం అత్యధికమై, గాలిలో తేలిపోగా, ఉల్లాస భరితంగా రాసక్రీడకు ఉపక్రమించారు.
అనేక మంది స్ర్తిలు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని, మండలాకారంగా నిలబడి చేసే నృత్యాన్ని రాసక్రీడ అంటారు.
(ఇంకా వుంది)

- కుప్పా వేంకట కృష్ణమూర్తి.. 9866330060