Others

దాన వీర శూర కర్ణ (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వర్గీయ ఎన్టీ రామారావు స్వీయ దర్శకత్వంలో రామకృష్ణ సినీ స్టూడియోస్‌పై సమర్పించిన అద్భుత కళాఖండం ‘దాన వీర శూర కర్ణ’. రంగుల రసమయ కావ్యమది. ఈ పౌరాణిక చిత్రంలో ఎన్టీఆర్ -శ్రీకృష్ణ, సుయోధన, కర్ణ అనే మూడు పాత్రల్లో తనకు తానే సాటి అనిపించుకున్నారు. కుమారులైన బాలకృష్ణ, హరికృష్ణను అర్జునునిగా, అభిమన్యునిగా వీరోచిత పాత్రల్లో విజృంభింపజేశాడు. చలపతిరావు చేత ఇంద్ర, సూర్య పాత్రలు వేయించారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో రారాజు సుయోధనునిగా పలికిన సంభాషణలు- ‘ఏమంటివి? ఏమంటివి?’ అంటూ ఈనాటికీ మారుమ్రోగుతూనే ఉంటాయి. సమాజంలోని అసమానతలు, ఆచార్యదేవుల కట్టుబాట్లను ఛేదించే ప్రయత్నం, పెద్దలను ఎదిరించి అణగారిన జాతికి పెద్దపీట వేయడం, కర్ణుని రాజుగా చేయడం లాంటి దృశ్యాలతో కూడిన సంభాషణలకు ప్రేక్షకులు హర్షధ్వానాలు పలికారు. నెగెటివ్ షేడ్‌వున్న దుర్యోధనుని పాత్రలో కూడా స్నేహశీలత, సింహపౌరుషం, ఆత్మాభిమానం, ప్రజానుకూలతను మలచుకోవడంలో నేర్పరితనాన్ని తన నటనానుభవంతో, దర్శకత్వ పటిమతో ప్రదర్శించాడు ఎన్టీఆర్. ఇక సుయోధనుడు కృష్ణునితో పలికే సంభాషణల్లో -‘క్రిష్ణా రాయబారిగా వచ్చినపుడు రారాజు ఆసనము నుంచి లేచుట ఆచారము కాదు. గనుక నిన్ను ఉచితరీతినే గౌరవించితిని’ అన్న సమర్థింపు, ‘రాయబారీ! గోకుల విహారీ! నీవెంత ప్రవచించినను నీ అంతరాత్మలోని ఆంతర్యాన్ని గ్రహించలేని అభిలాన్ని కాను నేను’ అన్న వెటకారం, ‘ఆస్తి. 14 ఏళ్ళు పరాధీనమైన దానిమీద హక్కు శాశ్వతంగా తొలగిపోవునను సత్యం నీవెరగవా క్రిష్ణా’ అంటూ న్యాయవాదిగా వాదులాట ఎన్టీఆర్‌కే చెల్లింది. ‘చిత్రం హాయ్ భళారే విచిత్రం’ అన్న గీతం సుయోధునిపై పెట్టి సినీమేధావులని ఆశ్చర్యపరిచాడు. నవరసాలను అద్భుతంగా చూపించిన దావీశూ కర్ణ మళ్లీ -ఎన్టీఆర్ ముని మనుమడు శ్రీకృష్ణునిగా నిర్మాణంలోకి రానుండం హర్షించదగ్గదే.

-బి సుబ్రహ్మణ్యం, అల్లవరం