Others

పాడవోయి భారతీయుడా.. (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1964లో విడుదలైన ‘వెలుగునీడలు’ చిత్రం కోసం మహాకవి శ్రీశ్రీ రాసిన ‘పాడవోయి భారతీయుడా.. ఆడి పాడవోయి విజయగీతిక’ గీతం వింటే ఇప్పటికీ దేశభక్తి పొంగుతుంది. పెండ్యాల సంగీత సారథ్యంలో ఘంటసాల, సుశీల గానంచేసిన పాటను మనోరంజకమైన నృత్యరూపకంగా మలచినతీరు చిత్ర దర్శకులు ఆదుర్తి సుబ్బారావు ప్రతిభకు నిదర్శనం. ఆనాటికి స్వాతంత్య్రం సిద్ధించి దశాబ్దంన్నర దాటినా, ప్రజలకు స్వాతంత్య్ర ఫలాలు అందకపోవడాన్ని కవి ఈ పాట ద్వారా కళ్ళకు కట్టినట్టు వివరిస్తాడు. స్వాతంత్య్ర సముపార్జనలో వీరుల త్యాగాలను గుర్తు చేస్తూనే, అంతటితో మన కర్తవ్యం పూర్తికాలేదని, ఇంకా దేశాన్ని అభివృద్ధిపథంలో ముందుకు నడిపించాల్సిన బాధ్యతను కవి గుర్తు చేస్తారు.
ఈనాటికీ దేశం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలైన అధిక ధరలు, నిరుద్యోగం, అవినీతి, బంధుప్రీతి మరియు చీకటిబజారుల నుంచి దేశాన్ని రక్షించాల్సిన కర్తవ్యాన్ని గుర్తుచేస్తూనే, నాయకుల పదవీకాంక్షను, ప్రజలమధ్యగల కుల, మత, భాషావైషమ్యాలు మరియు స్వార్థపూరితమైన దోపిడీ వ్యవస్థను నిర్మూలించుకోవాల్సిన అవసరాన్ని కవి పాట ద్వారా ఉద్బోధిస్తాడు.
అలాగే చివరగా సమస్త మానవజాతి సౌభాగ్యం కోసం సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా అకుంఠితమైన దీక్షతో ముందుకు సాగితే, మన భారతదేశం ప్రపంచానికే తలమానికం కాగలదనే సందేశాన్ని కవి ఈ పాట ద్వారా ఇస్తాడు. దేశభక్తి విప్లవ మరియు శ్రామిక గీతాలనెన్నింటినో వ్రాసిన శ్రీశ్రీ పాటల్లో ఇదొక ఆణిముత్యం. ఈ పాట వ్రాసి 50ఏళ్లయినా ప్రస్తుత దేశ, కాల పరిస్థితులకు అద్దంపడుతుంది.

-్భర్గవీశ్రీను, రాజమండ్రి