Others
మోసపోవడమే బాగుంటుంది
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రతిసారీ మోసపోతున్నా...
ఎందుకనో
ఎదుటివారి మాటలను
మళ్లీమళ్లీ నమ్మాలనిపిస్తుంది
చాలామంది,
నన్ను అర్ధించేవాళ్ల అంతరంగాన్ని
చదివినట్లుగా,
మళ్లీ మోసపోవద్దని
మరీమరీ చెబుతూ వున్నా,
నాలో సహకార గుణమే ముందుకొస్తుంది
అంతరంగాన్ని చదవడమంటే,
ఎదుటివాళ్లని అనుమానించడమే
ప్రయత్నిస్తే,
మనసుని -
పరిశీలించవచ్చునేమోగాని
అవసర తీవ్రతను గుర్తించలేము
అవసరం మనిషిని చుట్టేస్తుంది
మస్తిష్కాన్ని మెలితిప్పేసి
గుండెల్లో గునపాలు దించేస్తుంది
పొరుగువారిని
సాయమడగాలనుకున్నా
అభిమానం కట్టేస్తుంది
అవకాశం చేయజారినా
మళ్లీ వస్తుంది. కానీ
మనిషి లేని లోటు పూడ్చలేనిది
అందుకే మనిషిని గదా...
అవసరాన్ని చూసి
మనసు స్పందిస్తుంది
అంత అవసరమే గాని
వాళ్లకి లేకుంటే
అంతకంటే ఆనందం ఏముంది
అందరి ఆనందం కోసం
ఎన్నిసార్లు అయనా
మోసపోవడమే బాగుంటుంది.