Others

శరీరమే శత్రువైతే...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్ర తంత్రాల
విభూతి చంమత్కారాలన్నీ
గాలికెగిరిపోయ...
మందుమాకులన్నీ
చేతులెత్తేసిన సమయాన,
మృత్యువు దరిదాపుల్లో
స్వర్గనరకాల భ్రమావరణంలో
ఇక దిక్కెవరని -
దిక్కులు చూస్తున్న మనిషి
జీవాణువుల
ప్రకృతి రహస్యాల
గహనాటడువులలో
అర్థిస్తున్నాడు మోకరిల్లి
ప్రాణభిక్ష పెట్టమని!!

- నిఖిలేశ్వర్, 9177881201