Others
గోడ గోడు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ష్! నెమ్మదిగా, గోడకు చెవులుంటాయ్!
జైలుగోడల మధ్య, కోట గోడలు చెప్పిన చారిత్రక కథలు
దేవాలయ గోడలపై భక్తి కథా చిత్రాలు
సంకుచితాభిప్రాయాల, భావాల గోడలచే
విడగొట్టబడని, వసుధైక కుటుంబంగా
నా దేశం వెలుగొందాలన్న విశ్వకవి,
గోడమీద బొమ్మ, గొలుసుల బొమ్మ,
గోడ దూకిన దొంగ
గోడ పత్రికలు, గోడమీద పిల్లివాటం
ప్రహరీగోడ, చైనాగోడ,
బెర్లిన్ గోడ, మెక్సికో గోడ
గోడ కోసం జాతీయ అత్యయక పరిస్థితట!
అడ్డుకు, అవరోధానికి ప్రతీక, ఆలవాలం.
నానా విధాలుగా నా గురించి
నలుగురి నాల్కలపై నలుగుతున్నాను!
పందికొక్కులు పడగొట్టాయో
ఇటికె లిట్టే ఇరిగాయో
చిత్తడి నేలకు మెత్తబడ్డానో
ఒరిగిపోయానొకవైపుకి.
అన్న చేసే కుడ్య పునరుత్థాన ప్రయత్నంలో
అసలిక్కడ నే(గోడ)నెందుకు
‘‘అరమరికలు లేనివారం
అడ్డుగోడలెందుకు?
చెట్టు నీదైనా నా యంటివైపు
కాయలను కాజేయనులే,
ఇద్దరిమధ్య అడ్డుండటం
ఇసుమంతైనా ఇష్టం లేదన్నట్లుంది గోడకి’’ అన్నాడు తమ్ముడు.
‘‘అడ్డుగోడ కట్టినా
అభిమానాలలాగే వుంటాయ
దుష్ట, నిషిద్ధ, అశుద్ధమైనవి
ఇరువైపుల ఇద్దరి దరికి రావు,
మంచి కంచెలు
మంచి ఇరుగు పొరుగుకు దోహదం
యబ్బందులు లేని ఇరుగు పొరుగు
వారమవుదామని’’
నిలబెట్టా డన్న నన్ను.