Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వనె్నల జాబిలిలో గంతులేయు కుందేటిని
మీ చినె్నల తోటలల తిరుగాడెడి తేటిని

ఈ ఒప్పుల కుప్పలపై రాలిన నెమలీకని
మీ కటారి చూపులందు నలిగిన పూరేకుని

మీ నవ్వుల రాలినట్టి పువ్వు లేరుకొంటిని
మీ కన్నుల జాలువారు రవ్వలేరుకొంటిని

మీ నడకల కులుకులందు తళుకులేరుకొంటిని
మీ కౌగిలిలోన కరిగి కర్పూరమ్మైతిని

ఈ ఎండిన పెదవులపై సుధలను కురిపించినారు
ఈ మోడున పల్లవాల అధరమ్ముల నతికినారు

ఈ మొగ్గను కదిపి, కుదిపి రంగులెన్నొ పులిమినారు
ఈ వాడిన పువ్వు దీసి వాల్జడ ధరియించినారు

తల్లిచాటు పిల్లవాణ్ణి నావెంటను పడినారు
చల్ల చిలికినట్లు చిలికి వనె్నలెన్నొ కూర్చినారు

వట్టి పల్లెటూరివాణ్ణి నన్నిట్టుల మలచితిరి
పిచ్చివాణ్ణి నాకిట్టుల పట్టమ్మును గట్టితిరి

నేను అందగాడినంచు మీ అందం మరచేరు
మీ వనె్నలు మీ చినె్నలు నా కన్నుల జూచికొనుడు

ఇంకావుంది...

-గన్ను కృష్ణమూర్తి.. 9247227087