Others

జాతీయవాదం తక్షణ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెప్టెంబరు 9, 2011 తర్వాత మత సాంప్రదాయాలను అనుసరించినా, బాధ్యతగల పౌరులుగా మెలుగుతున్న ముస్లిములను మంచి ముస్లిములుగాను, ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్న వారిని తీవ్రవాద ముస్లిములుగా గుర్తించి, తీవ్రవాదుల నుండి ఇస్లాంను కాపాడాలనే పిలుపును పాశ్చాత్య దేశాలు ఇచ్చాయి. ఈ రకమైన తేడా హిందువులకు కూడా వర్తింపచేయవచ్చుననే వారు కూడా ఉన్నారు. స్వాతంత్య్రోద్యమం సందర్భంగాను, ఆ తర్వాత కూడా హిందువుల్లోనూ తీవ్రవాదులు, మితవాదులు ఉంటూనే ఉన్నారు. దేశ విభజన సందర్భంగా అమాయకులైన హిందువులు ఊచకోతకు గురి అయితే, అందుకు ప్రతిగా తీవ్రవాద హిందువులు ముస్లిములపై ప్రతీకారం తీర్చుకోవటంలో దేశ విభజన రక్తసిక్తమైంది. కాంగ్రెస్ పార్టీ మతాన్ని స్వప్రయోజనాలకు వాడుకోవటం మొదలెట్టడంతో తీవ్రవాదులు అన్నీ మతపంథాలలోను పెరిగారు. ఒక రకంగా తీవ్రవాదానికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కాంగ్రెస్ అనుసరించిన రాజకీయాలే కారణమయ్యాయి.
సావర్కర్ నిర్వచనం..
‘మంచి హిందువునుంచి క్రైస్తవుడు, మంచి ముస్లిం కూడా అవుతాడు’ అని గాంధీ మహాత్ముడు ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. మతాన్ని అనుసరించడం అంటే ఉన్నత నైతిక ప్రమాణాలు కలిగి వుండటమే అని ఆయన నిర్వచించారు. నైతిక నిష్ఠ కలవాడే గాంధీజీ దృష్టిలో హిందువు. ఉన్నతమైన హిందువుకు- ఉన్నతమైన క్రైస్తవునకు, మహమ్మదీయునకు మధ్య తేడా ఉండదని ఆయన భావించారు. కాని గాంధీజీ నిర్వచనాన్ని అంబేద్కర్ ఒప్పుకోలేదు. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో రాజకీయ, నైతిక విలువలకు ప్రాధాన్యత యిచ్చేవారు ఉండరని, అంటరానితనం ఉన్నంతవరకు బానిసలకు యజమానులలో మంచివాళ్ళు కనపడరని, యజమానులలో కొంచెం మెరుగ్గా ఉండేవాళ్ళే ఉంటారని ఆయన అన్నారు. అంబేద్కర్ అభిప్రాయాలు గాంధీజీ భావాలకు పరస్పర విరుద్ధం. వీరసావర్కర్ ఈ ప్రశ్నకు సమాధానం ఇంకోరకంగా చెప్పారు. అనాదిగా ఈ దేశంలో ఉంటున్నవాళ్ళు. సాంస్కృతిక భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించకలిగినవాళ్ళు, ఒకే దేశం, ఒకే చరిత్ర కలిగినవారు, ఇతర దేశాల నుండి వచ్చిన మహ్మదీయులు, క్రైస్తవులు కానివారు హిందువులని ఆయన చెప్పారు. సావర్కర్ నిర్వచనానికి గాంధీజీ నైతిక ప్రమాణాలతో సంబంధం లేదు. ఈ దేశంలో తరతరాల నుండి నివసిస్తున్న ప్రతివాడూ హిందువే.
ఎవరు మతవాదులు..?
నెహ్రూ, ఆయనను ఆరాధించే వామపక్ష మేధావులు ‘లౌకిక’ రాజకీయాలను అనుసరించామని చెప్పుకుంటూ వచ్చారు. తమతో ఉన్నవారందరూ సెక్యులర్ అని, తమతో విబేధించేవారిని మతవాదులుగా వారు చిత్రీకరించారు. క్రైస్తవ మతవాదులతో, ముస్లిం మతవాదులతో కలసి పనిచేయటానికి, ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవటానికి వారు ఎన్నడూ సంకోచించలేదు. నెహ్రూ మార్కు లౌకికవాదులు అధిక సంఖ్యాకులు, అల్పసంఖ్యాకులు అనే కోణం నుంచే స్పందించేవాళ్ళు. మతప్రమేయం లేని రాజ్యంలో ఏ మతానికీ ప్రాధాన్యత ఉండకూడదు. సామాజిక, ఆర్థిక అంశాలు ప్రాతిపదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవచ్చు కాని మత ప్రాతిపదికపై ఎలాంటి డిమాండ్లు చేయకూడదు. ఏదైనా ఒక న్యాయ వివాదం సందర్భంగా తప్ప రాజ్యం మత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. అయితే అలాంటి విషయం పరిశీలనకు వచ్చినప్పుడే సెక్యులర్ రాజ్యం డొల్లతనం బయటపడింది.
రాజ్యం సమర్థతపై అనుమానాలు...
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో షాబానో మనోవర్తి వ్యాజ్యంలో అత్యున్నత న్యాయస్థానం యిచ్చిన తీరును పూర్వపరం చేయటానికి పార్లమెంటు చట్టం చేసింది. విడాకులు తీసుకున్నప్పుడు భార్యకు మనోవర్తి చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే అది ముస్లిం వ్యక్తిగత చట్టాలకు వ్యతిరేకమని, న్యాయస్థానం జోక్యం చేసుకోవటం తగదని ముస్లిం ఛాందసవాదులు చేసిన వాదనకు తలఒగ్గి రాజీవ్ గాంధీ మనోవర్తిని జీవితకాలం కాక 90 రోజులకు పరిమితం చేస్తూ చట్టం తీసుకొని వచ్చారు. ఎప్పటికీ తేలని రామజన్మభూమి వివాదంలో హిందువులు సహనం కోల్పోయి బాబరు కట్టడాన్ని కూల్చివేశారు. ఇందిరాగాంధీ మరణానంతరం ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోత, గుజరాత్‌లో మత కలహాలు మొదలైన పరిణామాలు కూడా సెక్యులర్ రాజ్యం బలహీనతను బయటపెట్టాయి. అల్పసంఖ్యాకులకు, అధిక సంఖ్యాకులకు రాజ్యం సమర్థత మీద, ఆలోచనల మీద అనుమానాలు పెరిగాయి. హింసాత్మక ధోరణులను అరికట్టడంలో రాజ్యవైఫల్యం స్పష్టం అయింది. ఏ మతవర్గానికీ వత్తాసు పలకకుండా నిరపేక్షగా రాజ్యం ఉండగలదా? అన్న ప్రశ్న కూడా వచ్చింది. రాజ్యాన్ని నడిపే పాలకులకు ఎన్నికల్లో గెలవటం ముఖ్యం కాబట్టి, అందుకు అనుసరించే వ్యూహంలో భాగంగా ఒకసారి అధిక సంఖ్యాకుల ఆకాంక్షల వైపో, మరోసారి అల్పసంఖ్యాకుల అవసరాల వైపో మొగ్గు చూపుతారు. తక్షణ ఎన్నికల అవసరాలే విధానాలను ప్రభావితం చేస్తున్నప్పుడు రాజ్యం ఏ వర్గాన్నీ పూర్తిగా వదులుకోదు. ఏ వర్గం పట్ల కూడా నిరపేక్షగా ఉండదు. ఇటీవలి కాలంలో కుల, మత రాజకీయాలు ఎక్కువ అవటం, కొన్ని కుల సమూహాలను, మత సమూహాలను ఆకట్టుకొనేందుకు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలకు విరుద్ధంగా రాజకీయ పక్షాలు పనిచేయడం ఆ విషయానే్న చెప్తున్నాయి.
అందరూ భారతీయులే..
1991లో అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలు నెహ్రూ విధానాలకు పూర్తిగా భిన్నమయ్యాయి. ఆర్థిక రంగంలోనే కాదు రాజకీయ రంగంలో సైతం సెక్యులర్ వాదుల ప్రాధాన్యత తగ్గి, హిందూత్వ వాదుల ప్రాముఖ్యత పెరిగింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో తిరుగులేని ఆధిక్యతతో హిందూత్వ వాదులు అధికారంలోకి వచ్చారు. హిందూత్వ వాదులు సిద్ధాంతపరంగా పైచేయి సాధించారు. గాంధీజీ నైతిక హిందువు నిర్వచనాన్ని వారు తమ నిర్వచనానికి అనుబంధంగా తీసుకొన్నారు. వారి దృష్టిలో మంచి హిందువు దేశాన్ని, జాతిని ప్రేమించాలి. సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించాలి. మతం పట్ల, ధర్మం పట్ల ఉన్న వ్యక్తిగత అభిప్రాయాలు దేశ ప్రయోజనాలకు హాని కల్గించకూడదు. మతమేదైనా దేశభక్తి కల్గి ఉండటమే ప్రధానం. ఇది గాంధీ, నెహ్రూల నిర్వచనానికి భిన్నమైనది.
రాజకీయ ప్రయోజనాల కోసం అల్పసంఖ్యాక వర్గాల వారి పట్ల మెతక వైఖరి అవలంభించి, వారిని బుజ్జగించే ధోరణులు జాతి ప్రయోజనాలకు ప్రమాదకరం. దేశ విభజనకు అంగీకరించి పాకిస్తాన్ ఏర్పాటుకు నెహ్రూ పరోక్ష కారకుడైనాడు. తూర్పు పాకిస్తాన్‌లో హిందువులను ఊచకోత కోసినప్పుడు ప్రధానిగా ప్రతి చర్య తీసుకోవడానికి నెహ్రూ వెనుకాడాడు. దాంతో లక్షలాది మంది హిందువులు కాందిశీకులైనారు. ఇనే్నళ్ళయినా కాశ్మీరులో రావణకాష్టం కొనసాగటానికి నెహ్రూయే కారణం. దొడ్డిదారిన కాశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చాడు. నెహ్రూ అనంతరం కూడా కాంగ్రెస్ వారు, వారికి మద్దతుగా వామపక్షాలు మత ఛాందస వాదులకు అనుకూలంగా వ్యవహరించటం వల్లనే కాశ్మీరు లోయ నుండి వేలాది హిందువులు వెళ్ళగొట్టబడ్డారు. ఇంతవరకూ వారికి కాశ్మీరులో పునరావాసం కల్పించలేకపోయారు. కానీ రోహింగ్యా ముస్లింల అక్రమ వలసలను జమ్మూలోకి ప్రోత్సహించడం, వారికి మద్దతుగా సభలు నిర్వహించటంతో లౌకికవాదుల దేశభక్తి హిందువుల దృష్టిలో ప్రశ్నార్థకమైనది.
హిందూత్వ వాదులు సమాజాన్ని హిందువులుగా, హైందవేతరులుగా నేరుగా విభజించటం లేదు. వారికి దేశ ప్రయోజనాలను ఆకాంక్షించే వారు హిందువులైనా, ఇతరులైనా ఆమోదయోగ్యులే. అబ్దుల్ కలామ్ దేశభక్తిని, నాయకత్వాన్ని గుర్తించటంలో ఆయన మతం అడ్డురాలేదు. ప్రముఖ కన్నడ రచయిత అనంతమూర్తి వంటివారు హిందువైనా, ఆయన రచనలను హిందూ వ్యతిరేకంగా ఉన్నాయన్న దురభిప్రాయంతో ఆయన గొప్పదనాన్ని వారు అంగీకరించటం లేదు. మంచికి- చెడుకు కొలమానం దేశభక్తిని కల్గి ఉండటమే. నిష్ఠాగరిష్టుడైన హిందువైనా, ముస్లిమ్ అయినా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడితే, రాతలు రాస్తే, పనిచేస్తే ఆ వ్యక్తులను నిరసించవలసిందే. వ్యక్తిగత నైతిక నిష్ఠతో సంబంధం లేదు. జాతికి, దేశానికి విధేయేతే ముఖ్యం. వారి దృష్టిలో హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడటం మత వ్యతిరేకత క్రిందకు మాత్రమే రాదు. అది జాతి వ్యతిరేకత కూడా అవుతుంది. ఎందుకంటే హిందూ మత విశ్వాసాలను ప్రశ్నిస్తున్నవారు ఇతర మతాల జోలికి, అక్కడ ఉన్న అణచివేతను, అశాస్ర్తియతను ఎత్తిచూపే సాహసం చేయటం లేదు. మహమ్మద్‌ను, క్రీస్తును ఒక్కమాట కూడా అనడానికి సాహసించని వారు శ్రీరాముని కించపరుస్తూ మాట్లాడటం హిందువులకు తీవ్ర ఆవేదనను, ఆగ్రహాన్ని కల్గిస్తున్నాయి. మంచి హిందువు, మంచి క్రైస్తవుడు, మంచి ముస్లిము ముందు మంచి భారతీయుడై ఉండాలని వారి ఆకాంక్ష. సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించే జాతీయవాదులే ఇప్పుడు కావాలి.

డా. బి.సారంగపాణి