Others

ఆ అమ్మే కాపాడింది (ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పటికి జ్యోతిలక్ష్మి చాలా పాపులర్ అయిపోయింది.
జ్యోతిలక్ష్మి పాటుంటే చాలు బయ్యరు సినిమా చూడ్డానికి వచ్చేవాడు.
జ్యోతిలక్ష్మికి డాన్సుపట్ల ఎంత క్రేజుండేదంటే.. సాంగ్స్ కంపోజ్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా క్లబ్ సాంగ్స్ కంపోజ్ చేస్తున్నపుడు, పామ్‌గ్రోవ్ హోటలుకి వచ్చి సత్యంగారితో కూర్చొనేది. ఈమె పాటలు ఎక్కువ స్వరపరిచింది సత్యంగారే! సత్యంగారి అభిమాని జ్యోతిలక్ష్మి.
జ్యోతిలక్ష్మి చెల్లి జయమాలిని. తను అక్క గురించి గొప్పగా చెప్పుకొనేది. జయమాలిని అసలు పేరు అలవేలు మంగమ్మ. ఒక్క మాటలో చెప్పాలంటే అక్క పేరెత్తినా, బొమ్మ చూసినా పరవశించిపోయేది జయమాలిని. ఈ విషయం తెలిసిన జ్యోతిలక్ష్మి పబ్లిగ్గా స్టేట్‌మెంట్ ఇచ్చింది. ‘ఆమెకూ నాకూ మధ్య ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. ఆమె నా పేరు అడ్డం పెట్టుకొని బ్రతకాలనుకుంటుంది. దాన్ని నేను ఖండిస్తున్నాను’ అని. ఈ విషయం తెలిసిన జయమాలిని ఏడ్చింది. పేపరు స్టేట్‌మెంట్ ఇచ్చినంత మాత్రాన అక్కచెల్లెళ్ల బంధం కాకుండాపోతుందా? అంటూ ఆత్మీయుల దగ్గర తన దుఃఖాన్ని పంచుకొంటూ పట్టుదలతో పనిచేయడం మొదలుపెట్టింది.
చెన్నైకి నలభై కిలోమీటర్ల దూరంలోవున్న కరుమారమ్మ గుడికి ప్రతి శుక్రవారం ఉదయం నాలుగ్గంటలకే హాజరయ్యేది. అయితే అప్పట్లో కెఆర్ విజయని దేవతలా చూసేవారు. కరుమారమ్మ గుడిలో తొలి పూజ కెఆర్ విజయకే దక్కేది. కెఆర్ విజయని చూడ్డానికి భక్తులు తరలి వచ్చేవారు. ఆ నాలుగ్గంటల సమయంలో జయమాలిని దిగిపారా చన్నీటితో స్నానం చేసి, తడిసిన వస్త్రాలతో ఆలయం చుట్టూ అంగప్రదక్షిణం చేసేది. ఆమెతోబాటు ఆమె చీర తొలగిపోకుండా చూసేవారూ కూడా ఉండేవారు కారు. పొర్లుతూ ప్రదక్షిణలు తొమ్మిదిసార్లు చేసేది. చేతులు గీరుకుపోయేవి. ఒళ్లంతా రక్తసిక్తమయిపోయేది. అయినా పట్టినపట్టు విడవకుండా గాయాన్ని సైతం లెక్కచేయకుండా ప్రదక్షిణలు చేసేది.
జయమాలినిలో వున్న గొప్పదనం ఏమిటంటే -చిన్న సినిమా పెద్ద సినిమా అనే వ్యత్యాసం లేదు. అన్ని సినిమాలూ ఒప్పుకొనేది. రెమ్యూనరేషన్ విషయంలోనూ అంత పట్టింపు ఉండేది కాదు. ఎంతిస్తే అంత పుచ్చుకొనేది.
జయమాలినికి అమ్మవారి ఆలయాలంటే విపరీతమైన భక్తి. మంగళవారం, శుక్రవారం మరియు అమ్మవారికి సంబంధించిన రోజుల్లో టి.నగరులో ముప్పత్తమ్మ, వలసరవాక్కంలో మాంగాడమ్మ, కుండ్రుత్తూరులో కరుమారమ్మ ఈ మూడు గుళ్ళూ చూసుకొని షూటింగుకి హాజరయ్యేది. అంటే ఏ అర్థరాత్రి దాటింతరవాతనో బయల్దేరాలి. అలా తన భక్తిని చాటుకుంది. తన బలాన్ని పెంచుకుంది.
జయమాలిని భక్తిశ్రద్ధలను గమనించిన ఆలయ సిబ్బంది ఆమెకు ప్రత్యేకమైన దర్శనం ఆఫర్ చేశారు. ఆమె సున్నితంగా తిరస్కరించింది. అమ్మవారి ముందు అందరూ సమానమే. నన్ను ప్రత్యేకించి చూడటం బావుండదు అంటూ తనవంతు వచ్చేవరకూ ఆగేది. జయమాలినికి ఆఫర్లు పెరిగాయి. పొజిషను పెరిగింది. సిరిసంపదలు పెరిగాయి. అయినా ఎప్పుడూ ఒకేలా వుండేది. ఒకానొక సమయంలో జయమాలిని, జ్యోతిలక్ష్మిలు కలిసి నటించవలసిన సందర్భం వచ్చింది. జ్యోతిలక్ష్మి పేరు బాగా మరుగున పడిపోయింది. ‘ఇటువంటి సమయంలో చెల్లి నాతో కలసి నటిస్తుందా?’ అంటూ ఆశ్చర్యంగా అడిగింది. జయమాలిని సంతోషంగా ఒప్పుకుంది.
కొసమెరుపు ఏంటంటే.. జయమాలినిని ఓ ఐపీఎస్ ఆఫీసరు కోరి పెళ్లి చేసుకున్నాడు. అంతే, నాటినుంచి ఆమె సినిమా ప్రపంచానికీ, మేకప్‌కీ, కెమెరాకి దూరమైంది. ఎంతమంది ఎన్ని లక్షలు ఆఫర్ చేసినా వాటికి చిరునవ్వు మాత్రమే సమాధానం ఇచ్చేది. ఏదయినా ఫంక్షనుకి హాజరైతే జయమాలినిని చూసి ఆశ్చర్యపోతారు. ‘అంతా అమ్మదయ. నేను బాగున్నాను. అందరూ బావుండాలని కోరుకుంటున్నాను!’ అంటుంది క్లుప్తంగా. జయమాలిని నమ్మకం వమ్ముకాలేదు.

-ఇమంది రామారావు