Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనగానే అక్కజమున వారు మునిగిపోయిరి
ఎప్పుడెట్టుల తేరుకొనిరొ ప్రశ్నల వర్షించిరి

కృష్ణపత్నులు
అది ఏమిటి విడ్డూరం మా సత్యే సీతయనుట?
అది ఏమిటి మీరెట్టుల రాముండా నాడు?

అష్టకష్టములను ఓడిన సీతమ్మోరెక్కడ?
అష్టైశ్వర్యాలదేలు సత్యభామ ఎక్కడ?

సతి నొక్కతెనేలుకున్నశ్రీరాముండెక్కడ?
వేనవేల కనె్నబ్రతుకులేలిన మీరెక్కడ?

నమ్మశక్యమే ఇయ్యది? నమ్మగలరె జనులు?
చాలించుడి ఎకసెక్కం! సత్యమేదొ తెలుపుడి!

శ్రీకృష్ణుడు
భూమిలేక ఆకసమ్ము ఎచట నిలుచునోరుూ?
భూమి లేక పాతాళపు చిరునామా ఏదీ?

భూమి లేక దిక్కులకే దిక్కన్నది యున్నదో?
భూమిలేక కాలమ్మను మాటొక్కటి కలదో?

భూమిలేక ప్రాణికోటి కెయ్యది ఆధారం?
భూమిలేక వృక్షకోటికేది ఆలవాలం?
ఇంకావుంది...

-గన్ను కృష్ణమూర్తి.. 9247227087