Others

సైనికా! మమ్ము క్షమించు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎముకలు కొరికే చరికి నీ దేహాన్ని
అర్పించి మాకు వేడినందిస్తే

ఊరికే ఊడిగం ఏమీ చేయట్లేదని
ఎగతాలి చేసేస్తాం...

మా రెక్కల కష్టాన్ని చెమట చుక్కల్ని
నీ జీతాలుగా మారాయని ఏడుస్తాం

మా స్వేచ్ఛకోసం నీ ఉనికిని చంపేసుకుంటే
ఎవడు చేయమన్నాడంటూ నిలదీస్తాం

దేశమంటే నీకు ప్రాణం
మాకు మాత్రం పూచిక పుల్లనే

శవ రాజకీయాలు వొట్టలొల్లులు
దేశం ఏమైపోతేనేమి...
ఉగ్రవాద ముష్కరులకు పంతవాడే గొప్ప
సహనమూర్తులున్న సమూహం

తీవ్రవాదానికి భేదం లేదంటూనే
చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు

ముక్కలయిన నీ దేహం సాక్షిగా
మా నిర్లక్ష్యం మాటున ఇంకెవరి ప్రాణాలు
బలి పెట్టాలో

మాబాధ్యతారాహాత్యానికి
దేశ పౌరునిగా నేను సిగ్గిల్లుతున్నాను.
సైనికా ! ఈ జన్మకి మమ్ముల్ని క్షమించు

- పుష్యమీ సాగర్ 9010350317