Others

నాకు నచ్చిన పాట ..ఖుషీ ఖుషీగా నవ్వుతూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇద్దరుమిత్రులు చిత్రంలో నాయికా నాయకులు ఖుషి ఖుషీగా నవ్వుతూ పాట పాడుతూ చివరిలో ‘హుషారుగా ఉందాములే.. హమేషా మజాగా’ అని ముగిస్తారు.
మేనాలోన ప్రియునిజేర వెళ్లింది నా చెలి మీనా/ నింగిదాటి ఆనంద సాగరం పొంగిపొరలె నాలోన అంటాడు ప్రియుడు. ఓహో చెలియా నీవుకూడా ఓ పెళ్లిపల్లకీ చూసుకో/ హాయిగొలుపు సన్నాయి పాటలో వలపుబాటలే వేసుకో అంటుంది ఆమె. ఇలా ఆహ్లాదకరమైన వర్ణనలు, గడసరి సమాధానాలతో సాగుతుందీ పాట. ఆకాశంలో ఇంద్రధనుస్సుపై తేలిపోదమీనాడే అంటే నీలి నీలి మేఘాల రథంపై తేలిపోదమానేడే’ అన్న చరణం ఎంతో కవితాత్మకంగా ఉంటుంది. పాట మొత్తం ఓ రస గుళిక. రాసింది దాశరథి. సంగీతం అందించింది స్వరాజేశ్వరరావు. సాలూరి పాటలలో శాక్సాఫోన్, గిటార్లు చక్కగా ఉపయోగిస్తారు. ఈ వాద్యాలలో నాందీ వాచకం ఆయనదే. సమకాలీన సంగీత యుగం నుండి ఆధునిక యుగానికి సంగీతాన్ని మళ్లించిన సారథి సాలూరి. దాశరథి తెలంగాణ కవి కనుక పాటలలో హిందీ, ఉర్దూ మాటలను ఉపయోగించారు. ‘ఖుషీ, హుషారు, నిషా, హమేషా, మేనా’లాంటి పదాలు వాడి హుషారు తెచ్చారు పాటకు. ఈ పాటేకాక చిత్రంలోని పాటలన్నీ హిట్టే. ఇప్పటికీ ఈ పాట వినిపిస్తుంటే ఖుషీఖుషీగానే ఉంటుంది. హుషారు గొలుపుతుంది.
***

వెనె్నల రచయితలకు సూచన

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు
ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.
ప కొత్త సినిమాలపై సమీక్షలు రాయాలనుకున్న ఔత్సాహికులు ముందుగా ఒకటి రెండు సమీక్షలు పరిశీలన కోసం రాసి పంపితే, పరిశీలించగలం.
ప తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే కొత్తసినిమాలను పరిశీలించే ఆసక్తి వున్నవారు, సంబంధిత వ్యాసాలు పంపితే అవీ ప్రచురణార్హమే.
ప కొత్త హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వ్యాసాలకు కూడా స్వాగతం.
ప ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని, అపురూప చిత్రాలువుంటే పంపొచ్చు.
ప రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో పళశశళ్ఘబజూళషష్ఘశ్ఘౄజ.ష్యౄకు మెయల్ చేయగలరు.
ప ప్రచురించిన (మీ వ్యూస్ మినహా) ప్రతి వ్యాసానికి పారితోషికం వుంటుంది.
మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

-బి రాజేశ్వరమూర్తి, చిలకలపూడి