Others

నా తెలుగు భాష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్యాలు మాలగా అల్లితే
చక్కని కావ్యం ప్రత్యక్షం
కవిత్వానికి ప్రాణం పోస్తే
మది అంతా సుగంధ పరిమళం
కథగా కదిలితే
కనుల చెమరింపు తథ్యం
నవలై ప్రతిబింబిస్తే
జీవిత పాఠం సాక్షాత్కారం
నాటిక సంభాషణలు పండితే
మనుషుల్లో మార్పు అనివార్యం
గజల్గా ఉదయస్తే
పదపదంలో ప్రేమ సందేశం
అసలు తెలుగంటేనే
అందమైన సాహిత్య విన్యాసం
రూపాలు వేరైనా
ఫలితం ఇంద్రధనస్సు సౌందర్యం
సరస్వతీ దేవి కరుణిస్తే
ప్రతి ఎదలో వీణారాగం
స్వభావాలను ఒలికించే
మాయా దర్పణం
నదిలా పరవళ్ళు తొక్కే
మధుర సంగీతం
ప్రతి మనసునూ కదిలించే
కరుణ రసం
ఎంత చెప్పినా ఇంకా ఇంకా చెప్పాలనిపించే
తీయని భాష నా తెలుగు భాష

- యలమర్తి అనూరాధ, 9247260206