Others

నెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎగిరే పక్షికి తెలుసు
నింగిలోని సౌఖ్యం
ఎంతగా అంబరాన్ని చుంబిస్తుందో
నీటిలోని చేపకు తెలుసు
నీళ్లలోన ఊపిరి
ఎంత చక్కగా నిలబడుతుందో
మట్టిలోని మొక్కకు తెలుసు
మట్టికున్న పట్టు
ఎదగడానికి ఎంతగా ఉపకరిస్తుందో
అడవిలోని జంతువుకు తెలుసు
వన విహారం
తన నైజాన్ని ఎంతగా తృప్తిపరుస్తుందో

అవును వాటికి తెలుసు
ఆశ్రయాన్నిచ్చి బ్రతుకును పండించే
నెలవులు
ఎంతటి శ్రేయోదాయకాలో
వివేకంతో స్వధరాన్ని పాటిస్తూ
సహజత్వంతో
భువిని ఎలా సంరక్షించుకోవాలో
మనుగడలను ఫణంగా పెట్టి
మరీచికల వెంట
అవి ఏనాడూ పరుగెత్తింది లేదు

మనిషికి కూడా తెలుసు
మన నేల మనకో నెలవని
అయనా
నేల విడిచి సాము చేస్తూనే వున్నాడు
అందలమెక్కి శూన్యంలో
మరో ప్రపంచాన్ని
వెదుక్కుంటున్నాడు
నడకలు నేర్పిన పుడమిని కాదని
నిలబడలేని లోకాలవైపు
అడుగులు వేస్తున్నాడు

మనిషి గ్రహించాలి
విజ్ఞానాన్ని వివేకంతో ముడిపెట్టాలని
విధ్వంసం నుండి వేసే ప్రతి వెనకడుగు
జాతికి ముందడుగని
అమ్మ ఒడి ‘చెర’ కాదన్న
సత్యాన్ని తెలుసుకోవాలని
జీవన విలువలతో కూడిన
జీవిత మాధుర్యాన్ని
వెన్నంటే తరాలకు అందించాలని..

- కె. రవీంద్రబాబు, 9052778988