Others

దేహం నిండా దేశమున్నోడ్ని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను
ఆత్మ పతకాన్ని
ఆత్మీయ పతాకాన్ని
కదనరంగ కాయాన్ని
కనలిన కాలాన్ని
మరలిరాని లోకాన్ని
మరపురాని అవతారాన్ని.
*
నేను
దేశ పథాన్ని
దేశీయ పథకాన్ని
అయినవారి ఆశాకిరణాన్ని
మనసున మృత్యుకేతనాన్ని
సరిహద్దున సంచార సన్యాసిని.
*
నేను
కనుల దాగిన గుండె లయను
ఆత్మవిశ్వాస భువన శౌర్యాన్ని
గగన చుంబిత పరమచక్రాన్ని
అయినా,
మాతృగర్భ తనయుడ్ని
దేశమాత మానసపుత్రుడ్ని
అమ్మదేహ తొలి విజయాన్ని
మాతృదేశ మలి విజయాన్ని.
*
అవును, నేను
తొలిపొద్దు కవాతు కవనాన్ని
స్వ-పర లేని రక్షావలయాన్ని
సంధించిన ఆత్మచాపాన్ని
ప్రభవించిన మహాప్రస్థానాన్ని.
*
అవునవును, నేను
గన్నుకు మించిన దమ్మున్నోడ్ని
కత్తికి మించిన పదునున్నోడ్ని
గుండెనిండా ప్రాణమున్నోడ్ని
దేహం నిండా దేశమున్నోడ్ని.
*
నేను
దేశమాత వదలిన విల్లుని
అమ్మ అందించిన ఏకలవ్యుడిని
పొంచిన ప్రమాదాల లెక్కల మాస్టార్ని
జెండా నీడన చివరి చూపయినవాడ్ని.
*
కనుదోయికి కునుకులేనివాడ్ని
అయినా
కోటి కళ్లకు కునుకయినవాడ్ని
కనినవారికి దుఃఖభాండాన్ని
అయినా
కదనరంగానికి అమృతకలశాన్ని.
*
నేను
ఎవరికీ శత్రువును కాను
అయినా
శత్రువుకు నేను మిత్రుడ్ని కాను
అందుకే
మృత్యు పొదిన మిత్రుడను.

-విశ్వర్షి వాసిలి