Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం(సంవాదం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణుడు
కళ్ళుమూసకొంచు బ్రహ్మ సృష్టి రచన సేయు
కళ్ళు తెరిచి చూచిమిగుల పరితపించి పోవు

సీతను సృష్టించి పిప సీత బాధ గనెను
రాముని రచయించి పిదప రామకథను వినెను

తన తప్పును తెలిసికొనుచు పరిపరి చింతించెను
తన తప్పును దిద్దుకొనగ తపనజెంది పోయెను

అందులకే మీ సత్యను అందగత్తె జేసి
అందంతో ఐశ్వర్యము నతడు ప్రసాదించె

ఆపైనను శ్రీరాముని శ్రీకృష్ణుగ మలచె
ఆమెను అలరించమనుచు అవనిని బడద్రోసె

అందుకొరకె నేనిప్పుడు ఆమె వెంట తిరుగదు!
రాజ్యమ్మను మాట విడిచి సత్యభామ నేలుదు!

అందమ్మే చేతనుండ అందలమ్ములేల?
విశ్వమ్మే కౌగిలించ వీథుల పరుగేల?

సత్యావిధేయుడనెడు పేరు సార్థకమ్ము
సత్యమ్మే సత్యకొరకు ప్రాణమ్ములనిత్తు

అటుల నేనె రాముండను ఏక సతీవ్రతుడ!
ఇటుల నేనే కృష్ణుడను బహుపత్నీవ్రతుడ!

మారెను యుగధర్మమ్మే మారెను కాలమ్ము
మార్గమ్ములె వేరు కాని గమ్యమొమకటేను.
ఇంకావుంది...

-గన్ను కృష్ణమూర్తి.. 9247227087