Others

ప్రపంచ రికార్డు కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనె్నండు సంవత్సరాల వయస్సులో ఏకంగా పదకొండు ఎకరాల విస్తీర్ణంలో రంగోలీ వేసింది మహారాష్టల్రోని ఓ చిన్నారి. కోపర్‌గావ్ పట్టణంలో ఏడోతరగతి చదువుతున్న సౌందర్య బన్సోడ్.. మరాఠా యోధుడు చత్రపతి శివాజీని.. పదకొండు ఎకరాల విస్తీర్ణంలో ముగ్గుగా వేసి రికార్డు నెలకొల్పే ప్రయత్నం చేసింది. జంగల్ మహరాజ్ ఆశ్రమం వద్ద సౌందర్య ఈ ముగ్గు వేసింది. సంపన్న కుటుంబం కానప్పటికీ సౌందర్య లక్ష్యాన్ని నెరవెర్చేందుకు ఆమె తల్లిదండ్రులు 20 లక్షల రూపాయలు సమకూర్చారు. దీనికోసం సౌందర్య తండ్రి అప్పుచేయగా, తల్లి తన నగలను తాకట్టు పెట్టింది. ఈ రంగోలీ వేయడానికి సౌందర్య జనవరి 26వ తేదీ నుంచి ప్రతిరోజూ ఉదయం ఆరు గంటల నుండి, సాయంత్రం ఆరుగంటల వరకు సాధన చేసింది. ఇన్నిరోజుల వరకు దాదాపు 250 టన్నుల ముగ్గుపొడిని రంగోలీ కోసం ఉపయోగించిందట సౌందర్య. ఏదిఏమైనా ఆమె చేసిన ఈ ప్రయత్నం వృథాపోకుండా ఆమె ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కాలని కోరుకుందాం..