Others

కారణజన్ములు వివేకానందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌మోహన్ దత్త, దుర్గాచరణ్ దత్త, విశ్వనాధ దత్త మొదలైన సుప్రసిద్ధ దత్త కుటుంబ పరంపరలో విశ్వనాధ దత్త, భువనేశ్వరీ దేవి దంపతులకు కారణజన్ముడుగా వివేకానందులు ఉద్భవించారు. వివేకానం దుల పూర్వ నామం నరేంద్రుడు. పేరుకు తగ్గట్టుగానే ఆధ్యాత్మిక లోకానికి ఇంద్రుడై హైందవ ధర్మముయొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.
బాల్యంనుండే అసాధారణ లక్షణాలు కలవాడు. పశుపక్ష్యాదుల పట్ల ప్రేమ, ధైర్యం, రాజఠీవీ, అద్భుత జ్ఞాపక శక్తి, హేతువాదం, తర్కజ్ఞానం, మధురమైన కంఠం మొదలైన బహుముఖ ప్రజ్ఞలు కలిగి ఉండేవాడు. హైందవ ధర్మ రక్షణ కోసం దివినుండి భువికి దిగి వచ్చిన దివ్యాత్మ నరేంద్రుడుగా ఖ్యాతి నార్జించాడు.
ఆయన నిద్రకు ఉపక్రమించగానే ఒక దివ్య జ్యోతి ఆయన మస్తిష్కంలో కనపడేదట. దానిలో లీనమై వుండేవాడట. అదే నిద్రని అందరూ అలాగే నిద్రిస్తారని భావించేవాడట. కాని అది నిత్యం తాను ధ్యానంలో వున్నానని తరువాత తెలుసుకున్నాడు. బుద్ధిమీద అఖండ విశ్వాసం కల నరేంద్రుడు గొప్ప తార్కికుడు. దేనినీ ఒకపట్టాన విశ్వసించేవాడు కాదు. బ్రహ్మసమాజ ప్రభావం వల్ల మొదట విగ్రహారాధన ఆక్షేపించాడు. పాశ్చాత్య భావనా పోకడల వల్ల దేవుని ఉనికినే ప్రశ్నించాడు. కానీ ఇవన్నీ కారణ నిర్ణయాలే. భగవంతుడ్ని ప్రత్యక్షంగా చూడాలని ఎప్పుడూ తహతహలాడేవాడు. అనేకమంది సుప్రసిద్ధులను ‘మీరు భగవంతుడ్ని ప్రత్యక్షంగా చూసారా?’ అని ప్రశ్నించేవాడు. ఆ సుదీర్ఘ అనే్వషణ చివరకు శ్రీ రామకృష్ణుల వద్దకుచేరింది.
నిజానికి కారణజన్ముడైన నరేంద్రుని జన్మ, అతని కార్యకలాపాలు అన్నీ శ్రీ రామకృష్ణుల దివ్య దృష్టికి తెలుసు. రామకృష్ణులు నరేంద్రుని రాక కోసమే చూస్తుండేవారు.ఈ నరేంద్రుల గురించి రామకృష్ణులు తమ శిష్యుల దగ్గర ఆయన ప్రస్తావించేవారు. తరువాత దక్షిణేశ్వర్ వెళ్లడం, అక్కడ శ్రీ రామకృష్ణుల ద్వారా దివ్యానుభూతులు పొందడం నిర్ణయాత్మకంగానే చకచక జరిగిపోయాయి. రామకృష్ణుల పై నరేంద్రునకు క్రమంగా నమ్మకం కుదిరింది. గురుశిష్యులు ఇరువురు ఒకరినొకరు పరీక్షించుకున్న తీరు మనకు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, అది అంతా ఇరువురి దివ్యత్వాన్ని ఈ ప్రపంచానికి ప్రకటించడానికే అని మనకు బోధపడుతుంది. అద్వైతం పట్ల కలిగిన పెడభావం క్రమంగా శ్రీ రామకృష్ణుల ప్రభావంతో తొలగిపోయింది.
గురుశిష్యుల మధ్య వున్న అనుబంధం నిస్వార్ధ ప్రేమ ఒక్కటే! అత్యంత ధనవంతుల కుటుంబంలో జన్మించి కడు బీదరికం అనుభవించడం కూడా నరేంద్రుడు ఆధ్యాత్మిక పథంలో రాటుదేలడానికే! ఈ దారిద్య్ర అనుభవాల వల్లే తాను తన కుటుంబ పోషణార్ధం జన్మించలేదని ఈ ప్రపంచంలోని దరిద్ర నారాయణుల కోసం పాటుపడాలనే సత్యం బోధపడింది. తరువాత గురుదేవుల అనుమతితో సన్యాసం స్వీకరించారు. శ్రీరామకృష్ణులు భగవద్దర్శనం చేసారనే నమ్మకం కుదిరిన నరేంద్రునికి తన లౌకిక పరిస్థితులను చక్కపరచడానికి తనకోసం జగన్మాతను ప్రార్ధించవలసిందిగా కోరాడు. కాని ఆ గురుదేవుడు నీవే జగన్మాతను కోరుకో అనితన శిష్యుణ్ణి అమ్మదగ్గరకు పంపించాడు. ఈ రోజు మంగళవారం,, పవిత్రమైన రోజు ఈరోజు దేవాలయానికి వె ళ్లి కోరుకో! నీకు ఏది కావాలంటే అది ప్రసాదిస్తుందని చెప్పగా, నరేంద్రుడు ఆ రాత్రి జగన్మాతను దర్శించి కోరుకున్నాడు. కానీ లౌకిక బాధలను నివారించే ధన ధాన్యాలు కాదు. జగజ్జనని సాక్షాత్కారంతో ‘‘అమ్మా! వివేక వైరాగ్యాలను ప్రసాదించు, దైవ జ్ఞానము కల భక్తులను చేకూర్చు, సదా నీ దర్శనాన్ని అవిచ్ఛిన్నంగా అనుగ్రహించు’’ అని కోరుకున్నాడు.
కారణజన్ములకు ఇహలోక బాధలు వారిని అనుకొన్నమార్గంలోకి మళ్లించడానికే వస్తా యన్న విషయం ఎంతమందికి తెలుసు? ఆ తరువాత మళ్లీ రామకృష్ణుల దగ్గరకు నరేంద్రులు వెళ్ళినపుడు శ్రీరామకృష్ణులు ఏం కోరావని? అడిగి ‘‘నువ్వు లౌకిక సుఖాలకోసం జన్మించలేదని, జగద్ధితం కోసం జన్మించావని’’ దానివల్లనే నీవు అనుకొన్నది కాక మరొకటి కోరుకున్నావంటూ ఇలా జరగడానికి కారణం తెలియజేసారు. మన జాతిని తమో నిద్రనుండి మేల్కొలిపి దేశోన్నతి కోసం పాటుపడమని ఉద్ఘోషించిన ధీరోదత్తుడు, దేశభక్తుడు, కారణ జన్ముడు మన వివేకానందుడు. ఆయన చూపిన బాటలో మనమూ నడుద్దాం.

-చోడిశెట్టి శ్రీనివాసరావు