Others

మానవులే గొప్ప సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిశ్రామిక అభివృద్ధి వల్ల బడుగువర్గాల వారు వృత్తులు కోల్పోయి గత 200 సంవత్సరాల్లో వారి జీవితాలు శిథిలమయ్యాయి, కొడిగట్టిపోయాయి. అంతకన్నా ముందు సమాజాన్ని నిర్దేశించిన సామాజిక శక్తులుగా ఉన్న శూద్రులు పారిశ్రామీకరణ వ్యవస్థకు బలిపశువులయ్యారు. దాని అభివృద్ధిని అందుకోలేకపోయారు.
అభివృద్ధి నమూనా...
మనిషి ప్రాథమికంగా అభివృద్ధి నమూనాను రూపొందించుకోవాలి. కుటుంబం, నియోజకవర్గం ప్రాతిపదికగా అభివృద్ధి ప్రణాళికలు అమలు లోకి తెచ్చుకోవాలి. దేశమంటే మట్టికాదు. దేశమంటే ప్రాజెక్టులు కాదు. దేశమంటే పరిశ్రమలు కాదు. దేశమంటే మనుషులు. ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అని గురజాడ ఎప్పుడో చెప్పాడు. కానీ మన భారతీయ ప్రణాళికాకర్తలు దేశమంటే మట్టి, దేశమంటే ప్రాజెక్టులు, దేశమంటే రోడ్లు, దేశమంటే రైళ్లు, దేశమంటే టెలిఫోన్లు, దేశమంటే టీవీలు అన్నట్టు అభివృద్ధికి చిహ్నంగా వాటిని పేర్కొనడం జరుగుతున్నది. ప్రణాళికా సంఘం బడ్జెట్‌ల్లో వీటిని ప్రాతిపదికగా తీసుకొని కేటాయింపులు చేయడంలో ఈ విషయం గమనించవచ్చు.
జీవన ప్రమాణాలు...
మానవులే గొప్ప సంపద. మానవ వనరులను లక్ష్యంగా చేసుకుని ప్రణాళికలను, బడ్జెట్లను రూపొందించడం అవసరం. అప్పుడే ప్రతి మనిషికి జీవన ప్రమాణాలు ఎలా పెరిగాయో, ఎట్లా పెంచాలో అనే కర్తవ్యాలు ముందుకు వస్తాయి. అలా బడ్జెట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించినప్పుడు పనె్నండు యేళ్ళలో ప్రతి బాలిక, బాలుడు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పిల్లలు నైపుణ్యాలతో కూడిన డిగ్రీలు సాధించడం, ఉపాధి, ఉద్యోగ, సంపద సృష్టి సేవారంగాల్లో ఎదగడం సాధ్యమే. అందుకు కేజీ టూ పీజీ ఉచిత రెసిన్షియల్ విద్య ఒక గొప్ప ప్రణాళిక. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవితంలోని పైన పేర్కొన్న ఐదారు దశలను పట్టించుకొని ఆసరా పథకాలు, కేజీ టూ పీజీ విద్య, సామాజిక ఇన్సూరెన్స్ లబ్ధి, వృత్తుల్లో ఉన్నవారు ఆదాయం, నైపుణ్యాలు పెరగడానికి ప్రత్యేక కృషి, బడ్జెట్లు, కుల వృత్తుల ఆధునీకరణ, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, సాగునీరు, తాగునీరు, విద్యుత్, డబుల్ బెడ్‌రూమ్ పథకం వంటి వాటి ద్వారా తొలి అడుగులు వేయడం జరుగుతున్నది.
బడ్జెట్లను ప్రాజెక్టుల పునాదిగా, రోడ్లు పునాదిగా, రైళ్లు పునాదిగా రూపొందించే తీరును సమూలంగా మార్చడం అవసరం. మానవ వనరులను లక్ష్యంగా చేసుకుని బడ్జెట్లను ఆయా శాఖలను సమస్తాన్ని పునర్వ్యవస్థీకరించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీల వారీగా పరిశ్రమలను భూమిని నీటి ప్రాజెక్టుల బడ్జెట్‌లను, విద్యుత్తు బడ్జెట్లను, రోడ్ల బడ్జెట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీ ‘హెడ్స్’లో కేటాయించినప్పుడు అది బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు కచ్చితంగా అందుబాటులోకి వస్తాయి.
నిర్వాసితులకే అభివృద్ధి ఫలాలు...
గత రెండువందల సంవత్సరాల్లో పరిశ్రమల వల్ల, ఖనిజాల వెలికితీత వల్ల, అడవుల రక్షణ చట్టాల వల్ల, భారీ ప్రాజెక్టుల వల్ల కోట్లాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఉపాధి కోల్పోయారు. ఈ అభివృద్ధి భారతదేశంలో ఎవరిని ఆయా వృత్తులనుండి నిర్వాసితులను చేసిందో వారికే అభివృద్ధి ఫలాలను అందించాలి. ఇది జరిగి వుంటే భారతదేశం మరో విధంగా వుండేది. నిర్వాసితులంతా శూద్రులు, ఎస్సీ, ఎస్టీలే అయి పారిశ్రామిక లాభోక్తులంతా కొన్ని సామాజిక వర్గాల వాళ్లు కావడం వల్ల మునుపెన్నడూ లేనంత అసమానతలు పెరిగాయి. సంపద పంపిణీ మధ్య ఇప్పుడున్నంత అసమానతలు మునుపెన్నడూ లేదు.
నెహ్రూ ప్రధానిగా దేశంలో స్వాతంత్య్రం వచ్చాక పాత ఉద్యోగులను, ఉపాధ్యాయులను నిర్వాసితులను చేయలేదు. పాత వారికే శిక్షణ ఇచ్చి కొత్త లక్ష్యాలకు అనువుగా మలుచుకోవడం జరిగింది. కొత్తవారిని అంతకన్నా మంచి శిక్షణతో అభివృద్ధి పరుచుకుంటూ ఎవెల్యూషన్ సాధించారు. ఈ విధంగా చూసినప్పుడు కుల వృత్తులు, ఇతర వృత్తులు తరతరాలుగా చేస్తున్న వారికి ఆధునిక, పారిశ్రామిక, యాంత్రికీకరణ విధానంలో వారికే అందించడం జరగాల్సి ఉండింది. కానీ, వీటిని కూడా ఇతరులు ఆక్రమించడం వల్ల తీసుకోవడంవల్ల ఈ సామాజిక వర్గాల బతుకు దుర్భరమైంది. సైన్స్ టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలు పెరిగినప్పుడు, నూతన నైపుణ్యాలు అవసరమవుతాయి. కొత్త విద్యావిధానం అవసరమవుతుంది. అంతదాకా ఆయా రంగాల్లో ఉన్న వారికి, నూతన నైపుణ్యాల శిక్షణ, నూతన విద్యావిధానం ద్వారా శక్తి సామర్థ్యాలు అందించి ఎదిగించడం అవసరం. అప్పుడే సమాజ సంపద, జీవన ప్రమాణాలు, సహజ పద్ధతిలో ఎదుగుతాయి.
ఎంతో గొప్ప సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌లను అభివృద్ధి పరిచిన శూద్రులు శతాబ్దాలుగా భారతదేశం సమాజ నిర్మాతలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారతదేశ సమాజ నిర్మాతలైన శూద్రులను పారిశ్రామిక అభివృద్ధిలో నైపుణ్యంగల ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా, కార్మికులుగా తీర్చిదిద్దే ప్రణాళికలు స్వాతంత్య్రానంతరం ప్రణాళికా సంఘ లక్ష్యాలుగా నిర్దేశించుకోవాల్సి ఉండింది. ఇప్పటికైనా, ఎప్పటికైనా ఈ లక్ష్యం చేరుకున్నప్పుడే దేశం నాలుగు రెట్లు అభివృద్ధి చెందుతుంది. అన్ని సామాజిక వర్గాలు సమానంగా ఎదగడం జరుగుతుంది. సైన్స్ టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలు పెరిగినప్పుడు, నూతన నైపుణ్యాలు అవసరమవుతాయి. కొత్త విద్యావిధానం అవసరమవుతుంది. అంతదాకా ఆయా రంగాల్లో ఉన్న వారికి, నూతన నైపుణ్యాల శిక్షణ, నూతన విద్యా విధానం ద్వారా శక్తి సామర్థ్యాలు అందించి ఎదిగించడం అవసరం. అప్పుడే సమాజ సంపద, జీవన ప్రమాణాలు, సహజ పద్ధతిలో ఎదుగుతాయి.

-బి.ఎస్.రాములు