Others

జోలపాటలు తల్లికీ మంచివే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు పిల్లల్ని నిద్రపుచ్చేందుకు పెద్దవాళ్లు పాటలు పాడేవారు. ఇప్పటికీ కొన్నిచోట్ల ఆ సంస్కృతి ఉంది. ముఖ్యంగా తల్లి పాటలు పాడితే పిల్లాడికే కాదు, తల్లికి కూడా మేలు జరుగుతుందని ఓ అధ్యయనం చెబుతోంది. ప్రసవం తర్వాత వచ్చే కుంగుబాటు నుంచి బాలింతలు బయటపడేందుకు పాటలు పాడటం ఓ చక్కని మందులా పనిచేస్తుందని పరిశోధకులు గుర్తించారు. సాధారణ ప్రసవం తర్వాత చాలామంది మహిళలు ఓ రకమైన మానసిక కుంగుబాటుకు గురవుతారు. ఆందోళన పడుతుంటారు. పాటలు పాడితే ఈ సమస్యల నుంచి చాలా త్వరగా కోలుకోవచ్చని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. అందులోనూ ఒంటరిగా కాకుండా, గుంపుగా నలుగురితో కలిసి స్వరం కలిపే మహిళల్లో మరీ తొందరగా మార్పు వస్తుందని పరిశోధకులు గుర్తించారు. ప్రతి ఎనిమిది మంది బాలింతల్లో ఒకరు కుంగుబాటుకు గురవుతున్నారని అంచనా. ఈ సమస్య నుంచి తల్లి ఎంత త్వరగా బయటపడితే అంతమంచిది. గతంలో వయసు పైబడినవారు పాటలు పాడుతూ డెమెన్షియా వంటి మానసిక రుగ్మతల నుంచి బయటపడొచ్చని అనేక అధ్యయనాలు నిరూపించాయి. కానీ బాలింతలకూ పాటలు మందుగా పనిచేస్తాయని చెప్పిన తొలి అధ్యయనం ఇదే.. ప్రసవానంతరం కుంగుబాటుతో బాధపడుతున్న 134 మంది మహిళలపై అధ్యయనం చేసి.. వారిని మూడు గ్రూపులుగా విభజించారు పరిశోధకులు. ఒక బృందం వారితో గుంపుగా కలిసి పాటలు పాడించారు. రెండో గ్రూపులోని వారితో ఆటలు ఆడించారు. మూడో బృందం సభ్యులు సాధారణంగా కుటుంబ సభ్యుల సాయం తీసుకుంటూ.. మందులు వాడారు. అయితే మూడు బృందాల్లోని మహిళలు కోలుకునేందుకు పది వారాలు పట్టింది. వారిలో మొదటి గ్రూపులోని మహిళల్లో ఇతరుల కంటే చాలా త్వరగా కుంగుబాటు లక్షణాలు దూరమయ్యాయి. బృందంలో కాకున్నా.. తన బిడ్డ కోసం జోలపాటలు పాడిన తల్లులకు కుంగుబాటు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందని, వారి ఆరోగ్యం కూడా తొందరగా నయమవుతుందని యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు తెలిపారు.