Others

భాష ప్రాధాన్యత గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి, తన అనుభవాలనూ, ఆలోచనలనూ, ఆశలనూ వ్యక్తీకరించేది భాష. ఇంకోరకంగా చెప్పాలంటే మానవుడు సాధించిన జ్ఞానం అంతా నిక్షిప్తమై ఉండేది భాష. చరిత్ర అయినా, సామాజిక శాస్త్రం అయినా, సైన్స్ అయినా, సాహిత్యమైనా, తత్వశాస్తమ్రైనా- ఏదో ఒక భాషలో వ్యక్తీకరించబడాలి, నిక్షిప్తం కావాలి, భవిష్యత్తుకు దీపం కావాలి. వీటితో నేరుగా సంబంధమున్న వ్యక్తులు తమ మాతృభాషలో చెబితే అది మరింత సమగ్రంగా, శక్తిమంతంగా ఉంటుంది. ఇక్కడే మాతృభాషల ప్రాధాన్యత గుర్తించాలి. ఒకచోట ఓ భాష అదృశ్యమైతే, అంతవరకు ఆ ప్రాంతంలో నిక్షిప్తమైన మానవ అనుభవం, జ్ఞానం కనుమరుగవుతాయని గమనించాలి. ఈ కారణంగానే మనం మాతృభాషలను సంరక్షించుకోవాలి; సంవృద్ధి చేసుకోవాలి; శాస్తస్రాంకేతిక విజ్ఞానాలు ఉపయోగించుకుని మరింత మన్నిక, ఉపయోగం పెంచుకోవాలి.
రెండు దశాబ్దాలుగా మాతృభాషలు గురించి అవగాహన, ఆందోళన, అర్థమైన ఆలోచనలు పెరిగాయి ప్రపంచవ్యాప్తంగా. దానికి ప్రతీకవంటి సందర్భం అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం (్ఫబ్రవరి 21). తెలుగు ప్రాంతాల్లో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, కొంత స్పష్టత ఉంది. అయితే ఇంకా భాష అనేది రాజకీయ అధికారాన్ని నియంత్రించే శక్తి తెలుగు ప్రాంతంలో సంతరించుకోలేదు. కానీ భాషా సంస్కృతులకు ఒక భాగం, ఒక మంత్రిత్వశాఖ వగైరా ఆలోచనలు ప్రాచురంలోకి వచ్చాయి. ఆరు దశాబ్దాల క్రిందట దేశంలో తొలుత తెలుగులో సాహిత్య అకాడమి ఏర్పడింది. నాటక, లలిత కళలు, సంగీత అకాడమిలుగా విస్తృతమైంది. తెలుగు భాష ప్రతిపాదికగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా ఎన్టీరామారావు అకాడమిలను రద్దుచేశాడు. తెలుగు విశ్వవిద్యాలయంలో అంతర్భాగం చేశారన్నారు. తెలంగాణాలో నాలుగేళ్ళ క్రితం, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంవత్సరంలో సాహిత్య అకాడమిలు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో అధ్యక్షునితోపాటు 11మంది సభ్యులను కూడా నియమించగా, తెలంగాణాలో అధ్యక్ష, కార్యదర్శులను మాత్రం నియమించారు. ఆలస్యం చేసినా, నియమించక తప్పని పరిస్థితి తయారవుతోంది. సేకరించడం, భద్రపరచడం, ప్రచురించడం చాలా ప్రధాన కర్తవ్యాలు అకాడమిలకు. భాషకున్న పరిధిని గుర్తించకుండా గందరగోళం జరుగుతుంటుంది. భాష అనేది ఒక సాధనం. దాని ద్వారా వ్యక్తీకరణ జరుగుతుంది. వస్తుపరమైన విస్తృతి ఉండాలి. కొన్ని కారణాలవల్ల కొన్నింటి ప్రచారం ఉంటుంది. అందులో రకరకాల అంతర్గత వ్యూహాలుంటాయి. కానీ రాబోయే తరాల గురించి ఆలోచించినపుడు ఇలాంటి అజెండాలకు ప్రాధాన్యత ఉండకూడదు. చరిత్ర, సామాజిక శాస్త్రాలు, జానపద విజ్ఞానం, శాస్తస్రాంకేతిక విజ్ఞానాలు, తత్వశాస్త్రం వంటివి చాలా ప్రధానంగా ఉండాలి. సాహిత్యంతోపాటు. అలాగే జీవిత చరిత్రలు, ఆత్మకథలు, సంస్థల చరిత్రలు, యాత్రా చరిత్రలు ముందుముందు కీలకం కనుక, వాటిని తప్పనిసరిగా భద్రపరచాలి, రాయించాలి! భాషలకు- ముఖ్యంగా మాతృభాషలకు ఉండే ప్రాధాన్యతలను గుర్తిస్తే ఈ పార్శ్వాలను గమనించడం కష్టంకాదు.

-డా. నాగసూరి వేణుగోపాల్ 94407 32392