AADIVAVRAM - Others

శ్రీహరిపై భక్తి.. వాంఛల నుంచి విముక్తి-(రాస క్రీడాతత్త్వము-15)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ శాస్ర్తీగారు ఉత్తరదేశీయులు. ఆయన తమ పురాణతత్త్వ దర్శనంలో ఇలా వ్రాశారు -
‘‘మేము దర్శించిన యోగి బీహారులోని సారన్ జిల్లావారు. సంస్కృతంలో శ్లోకబద్ధంగా మాట్లాడేవారు. వారొకసారి తమ మూత్రద్వారం ద్వారా నూనెను పిచికారీ లాగా లోపలికి పీల్చుకోవటాన్ని ప్రదర్శించారు.
‘‘అది చూసి ఆశ్చర్యచకితులైన మేము, ఆయనను అనేక విధాలుగా ప్రాధేయపడగా వారిలా చెప్పారు -
‘‘ఇలాంటి యోగరహస్యాలు బహిరంగంగా మాట్లాడ రాదు. కానీ, మీరు పండితులు గనుక, మీ ద్వారా లోకానికి ఉపకారం జరుగుతుందనే ఆశయంతో మీకు నా సాధనా రహస్యాన్ని ఒక దాన్ని చెపుతున్నా. నేను వజ్రోళీయోగ సాధకుడ్ణి. నేనిప్పుడు తైలాన్ని పీల్చటం మీరు చూశారు గదా. ఆ తరువాత పాదరసాన్ని పీల్చగలగాలి. ఆ తరువాత స్వవీర్యగ్రహణశక్తి వస్తుంది. ఇది కేవలం హఠయోగ ప్రక్రియ మాత్రమే కాదు. పతంజలి యోగసూత్రాలలో -
‘‘గ్రహణ స్వరూపాస్మితాన్వయార్థవత్త్వ సంయమా దింద్రియ జయః’’ (విభూతిపాదం - సూ.47) అనే సూత్రం వుంది. దీనిలో గ్రహణమనే పదానికి వ్రజ్రోళీప్రక్రియ ద్వార స్వవీర్యగ్రహణం చేయటమనేదే అసలైన అర్థం. కానీ వ్యాఖ్యాతలు దీన్ని రహస్యంగా వుంచుతారు. దీన్ని సాధిస్తే ఇంద్రియజయం సిద్ధిస్తుందని పతంజల మహర్షే స్వయంగా చెప్పాడు’’ - అని.
ఇంతకూ చెప్పవచ్చిన విషయమేమిటంటే, సంపూ ర్ణేంద్రియనిగ్రహ సాధకమైన వజ్రోళీ అనబడే యోగప్రక్రియ ఒకటి, కొద్ది ఏళ్ళ క్రిందటి దాకా మన దేశంలో సజీవంగా వుండేది. ఇప్పటికీ దాన్ని రహస్యంగా సాధన చేస్తున్న మహానుభావులు వుంటే వుండవచ్చు.
శ్రీకృష్ణుడి కాలంలోని యోగీంద్రులలో అనేక మందికి ఇలాంటి ప్రక్రియలు అనేకం తెలుసు. వాటిలో వారు సిద్ధహస్తులు. అందువల్లే జితేంద్రియులుగా విరాజిల్లేవారు.
కానీ, ఇక్కడ రాసక్రీడాలీలను ప్రదర్శిస్తున్న శ్రీకృష్ణుడు ఎనిమిదేళ్ళ బాలుడు. అతడు ఇలాంటి యోగసాధనలు చేసే అవకాశమే లేదు. ఇలాంటి యోగ ప్రక్రియలేమీ లేకుండానే అతడు అనేక వందల మంది గోపికల మధ్యలో క్రీడిస్తూ గూడా జితేంద్రియుడై ప్రకాశిస్తున్నాడు.
ఇదే ఆ యోగీంద్రుల ఆశ్చర్యానికి కారణం. శ్రీకృష్ణుడు వయస్సు రీత్యా యువకుడై, ఎనిమిది మంది భార్యలతో సంతానవంతుడై వున్న రోజులలో గూడా, ఇటువంటి జితేంద్రియత్వసిద్ధినే ప్రదర్శించాడని నారదమహర్షి పరశురాముడికి ఆశ్చర్యపూర్వకంగా చెప్పాడని భాగవతం లోనే వుంది. ఇలాంటి సిద్ధికి ఆయన విషయంలో యోగవిద్య కారణం గాదనీ, ఆయన యొక్క ఆత్మారామ త్వమూ, పరమాత్మత్వమూ మాత్రమే దానికి కారణాలనీ, గ్రహించారు గనుకనే, నారదాది మహర్షులు గూడా ఆశ్చర్యచకితులయ్యారు.
ముగింపు :-
ఆ విధంగా గోపికలనూ, వారి భర్తలనూ, వారి బంధువులనూ, అందరినీ అనుగ్రహించడం కోసం లీలామానుషదేహం ధరించిన శ్రీకృష్ణుడు, ఆయా భక్తులను ఆయా రీతులలో అనుగ్రహించే విధానంలో భాగంగా, గోపికలతో ఇలా రాసక్రీడలు సాగిస్తుంటే, ఆయన మాయాప్రభావంవల్ల గోపికల స్థూల శరీరాలను చూసుకుం టున్న బంధువులకు ఏ అనుమానమూ రాలేదు, ఎవరికీ అసూయ కలుగను లేదు.
ఇక తెల్లవారబోతూ వుండగా, శ్రీకృష్ణుడి అనుమతి తీసుకుని, ఆ గోపికల సూక్ష్మశరీరాలన్నీ తమ తమ దేహాల్లో ప్రవేశించాయి. కానీ, కృష్ణమాయాబలం వల్ల ఆ జీవులకు ఈ వివరమేమీ తెలియదు.
శ్లో॥ వ్రజవధూభి రిదం చ విష్ణోః
శ్రద్ధాన్వితోను శృణుయా దనువర్ణయే ద్యః
భక్తిం హరౌ భగవతి ప్రతిలభ్య కామం
హృద్రోగమాశ్వపహినోత్యచిరేణ ధీరః ॥
(్భగవతం-స్కం 10, అధ్యా-33, శ్లో-41)
(్భవం : ఈ విధంగా పరమాత్మ అయిన విష్ణువు, గోపవధువుతో చేసిన క్రీడలను శ్రద్ధతో వర్ణించేవారికీ, వినేవారికీ, శ్రీహరియందు స్థిరమైన భక్తి కుదిరి, హృదయంలో ధీరత్వం పెరిగి, హృదయాన్ని పట్టి పీడిస్తున్న కామరోగం త్వరగా తొలగిపోతుంది.)
శ్రీకృష్ణార్పణమస్తు
అనుబంధము
గోపికా గీతము
(శ్రీమద్భాగవతంలో పదవ స్కంధంలో గోపికాగీతము అనబడే 31వ అధ్యాయం)
ఇప్పటివరకూ మనం చెప్పుకున్న కథా గమనంలో శ్రీకృష్ణుడియొక్క రాసక్రీడలోని అసలైన అంతరార్థాన్ని గ్రహించే ప్రయత్నం కొంత చేశాం. ఆ ప్రక్రియలో గోపికాగీతల గురించి ప్రస్తావించుకొని, రెండు మూడు శ్లోకాలు ఉదాహరణంగా చెప్పుకున్నాము. కానీ, రాసపంచా ధ్యాయి అనబడే ఈ ఐదు అధ్యాయాల సంపుటంలో గోపికాగీతాధ్యాయానికి చాలా ప్రముఖమైన స్థానం వుంది కనుకను, నిజమైన మధురభక్తి ఉపాసనా మార్గానికి ఈ అధ్యాయం ఉత్తమమైన ఉదాహరణ కనుకను, ఈ అధ్యాయంలోని శ్లోకాలను, వాటి తాత్పర్యాలను, మనం సంగ్రహంగా చెప్పుకుందాం.

రాసక్రీడ శృంగారం కాదా?.. - కుప్పా వేంకట కృష్ణమూర్తి.. ఎమ్మెస్కో ప్రచురణ.. ప్రతులకు- 1-2-7, భానుకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమల్‌గూడ, హైదరాబాద్-29. మరియు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో..
(ఇంకా వుంది)

- కుప్పా వేంకట కృష్ణమూర్తి.. 9866330060