Others

అభిమాన ధనం.. శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్ల వెంకట రంగారావు. జన బాహుళ్యంలో ఎస్వీ రంగారావుగా పాపులరైన ఈ నటుడు మనకు దూరమై దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ దక్షిణాది ప్రేక్షకుల హృదయాలలో చిరంజీవిగా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఆయన నటించిన శాంతి రస పాత్రలను గుర్తుకుతెచ్చుకొంటే బంగారుపాప, పండంటి కాపురం, తాత మనవడు చిత్రాలు మచ్చుతునకలు. ఇక పౌరాణిక ప్రతినాయక పాత్రలు గుర్తుకు తెచ్చుకొంటే హిరణ్యకశిపుడు, మైరావణుడు, రావణుడు, భస్మాసురుడు, కంసుడు, కీచకుడు, దుర్యోధనుడు.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో. తెలుగు, తమిళం, ఆంగ్ల భాషలతోపాటు
సంస్కృతంలోనూ అనర్ఘళంగా మాట్లాడగల ఈ మహా నటుడి నట జీవితంలో ఒక సంఘటన గుర్తు చేసుకుందాం.
ఒక చిత్రం షూటింగ్ జరుగుతోంది. అది వివాహ శుభకార్యం సీను. పురోహితుడు పాత్రధారి మంత్రోచ్ఛారణ సాగుతోంది. సడెన్‌గా కట్.. కట్ అన్న గంభీర స్వరం వినిపించిందట. దర్శకుడు దగ్గరనుంచి సెట్ అంతా నిశ్శబ్ధం. కట్ చెప్పిన ఎస్వీఆర్, సరైన మంత్రం జపించి ఆ పాత్రధారి మంత్రోచ్ఛారణను సవరించగానే షాట్ ఓకే అయిందట. తన పాత్రతోపాటు ఇతర పాత్రల డైలాగులనూ సవరించగల నేర్పరి రంగారావు అని సెట్‌లో అందరూ ఆనందం వ్యక్తం చేశారు.
సాధారణంగా రాజకీయ నాయకుల శిలావిగ్రహాలను నగర కూడలిలో ఆవిష్కరించటం అభిమాన హీరోల నిలువెత్తు కటౌట్లు ఏర్పరచి పూలదండలతో అలంకరించటం చూస్తుంటాం. రాజమండ్రిలో అభిమానులు యస్వీఆర్ శిలావిగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదే ఈ చిత్రం. యస్వీఆర్ పట్ల రాజమండ్రివాసుల అభిమానానికి విలువ కట్టగలమా అనిపిస్తుంది. రాబోయే కాలంలో మరెందరో నటులు రావచ్చు కాని యస్వీఆర్ లాంటి నటుడిని చూడగలమా? అలాంటి మహానటుడు మళ్లీ తెలుగు తెరకు దొరుకుతాడా? అసంభవం కదూ!

-పర్చా శరత్‌కుమార్ 9849601717