Others

నవవిధ భక్తి మార్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుని చేరడానికి అనేక విధానాలు న్నాయ. వాటిలో భక్తి మార్గం ఉన్నతో న్నతమైంది. ఆ భక్తిమార్గంలోను నవవిధాలున న్నవి. వాటిని ఒక్క సారి స్మరించుకుందాం. భగవంతుని ప్రేమను పొందుదాం.
శ్రవణం: శ్రవణం అనగా వినడం, శ్రవణం అంటే వినడం, శ్రద్ధగా జరగాలి. మహాభారతంలో అర్జునుడు యుద్దముచేయడానికి మనో వికలుడు అయినపుడు శ్రీకృష్ణుడు గీతోపదేశము చేసాడు. దానిని శ్రద్దగా విని తన అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. భగవంతుని కథలను వినసొంపుగా చెబుతూ ఉంటే వినడమే శ్రవణమనే భక్తిమార్గం.
కీర్తనం: భగవంతుని గుణనామాలను కీర్తించటం. కథలరూపంలోనో, భగవంతుని నామలీలాగుణాదులను మనస్ఫూర్తిగా ఉచ్ఛస్వరంతో పలకడం, భగవంతుని లీలావిశేషాలను పదకవితలుగానో, లేక కీర్తనరూపంలోను పలకడం ఇవి అన్నీ కీర్తనం అన్న భక్తిమార్గంలోకి వస్తాయి.
స్మరణం: మననం అంటే పదేపదే అనుకోవడం. మహాభారతంలో ద్రౌపది పాండవ పత్ని శ్రీకృష్ణుని భగవంతునిగా, అన్నగా నమ్ముతుంది. ఆమె నిరంతరం ఏమరక కృష్ణ నామాన్ని స్మరించుకునేది. అందుకే కృష్ణయ్య ఆమెకు ఆపద సమయాల్లో దగ్గరకు వచ్చి కాపాడాడు. దూర్వాసమహాముని శాపాన్నుంచి తప్పించుకోవడానికి ద్రౌపదికి అక్షయ పాత్రనిచ్చాడు. కౌరవ సభలో వస్త్రాపహరణం చేయబోతుంటే వెనువెంటనే కనబడి వలువల్ని ప్రసాదించాడు.
పాదసేవనం: భగవంతుని సర్వావస్థలయందు నమ్ముతూ అతని పాదపద్మాలను సేవించడం.
వివరణం: కష్టమైనను, సుఖమైనను భగవంతుని నామాన్ని మరవక ధ్యానించడం అన్నింటికీ కర్త కర్మక్రియ అన్నీ భగవంతుడే అని నమ్మడమే పాదసేవనం: భరతుడు రాముని పాదుకలను రామునిగా భావించి సేవించాడు. సత్యభామ శ్రీకృష్ణ తులాభారం వేస్తే రుక్మిణీదేవి వచ్చి ఒకే ఒక్క తులసీ దళం వేసి కృష్ణుడిని సరితూగేట్టుగా చేసింది. ఇదంతా ఆమె ప్రతిరోజు తన మగనిని ప్రత్యక్షదైవంగా భావించి సేవించిన ఫలమేనని రుక్మిణీ దేవి చెబుతుంది.
అర్చనం: షోడశోపచార పూజయే అర్చనం. భగవంతుని అర్చామూర్తిగా ఎదురుగా నిలుపుకుని 16 ఉపచారాలను చేయడమే అర్చనం. రమ్మని ఆహ్వానించడం, ఆసనం ఇవ్వడం, కాళ్లు కడగడానికి నీళ్లు ఇవ్వడం, స్నానం చేయించడం, గంధం పూయడం, బట్టలు ధరింపచేయడం, కుంకుమ ధారణ చేయడం ఆహారాన్ని నివేదన చేయడం పవళింపుసేవ చేయడం ఇట్లాంటి వన్నీ భగవంతునికి చేయడం అర్చనం అని చెప్పుకోవచ్చు. అయితే చిత్తాన్ని పూర్తిగా భగవంతని యందే నిలిపితే తప్పక భగవంతుడు మెచ్చుతాడు.
వందనం: నమస్కారం చేయడమే వందనం. గురువుకు, పెద్దలకు, భగవానునికి వంగి నమస్కారం చేయడం అంటే అహంకారాన్ని వదిలివేయడం ఆంజనేయుడు ఎంతటి బలవంతుడైనా శ్రీరామ అంటూ రామునికి నమస్కరించి ఆపై మాత్రమే పనులను ఆరంభించేవాడు. అన్నింటా విజయం సాధించేవాడు కనుక ఎవరైనా భగవంతునికి నమస్కరించి నన్ను ధర్మాచరణలో సత్యధారణ చేస్తూ విజయం వైపు నడిపించు అని కోరుకుంటూ నమస్కారం చేయడం వందనం అనే భక్తిమార్గంలోకి వస్తుంది.
దాస్యం: సర్వకర్మలు ఒక దాసునిగా భగవంతునికి చేయడం. సేవకునిగా భావించి భగవంతుని కొలవడమే దాస్యం. ఆంజనేయుడు , గుహుడు, లక్ష్మణుడు వీరంతా దాస్యసేవానిరతిలో అఖండులుగా పేరెన్నిక గన్నారు. ఇహలోకంలో ఏ కర్మ చేసినా అది అంతా భగవంతుని సేవగా భావిస్తే అది అంతా కూడా భగవంతుని సేవఅనే ఖాతా లోజమ అవుతుంది.
సంఖ్యం: స్నేహం చేయడం, భగవంతుడిని చెలికాడని, స్నేహితుడని భావించిసేవించడమేసంఖ్యం. కుచేలుడు , కృష్ణుడు ఇద్దరూ సహధ్యాయిలు. వారిద్దరూ కలసి చదువుకున్నారు. కలసి ఆడుకున్నారు. పాడుకున్నారు. గృహస్థాశ్రమంలోకి వెళ్లాక కృష్ణుడు ఆగర్భశ్రీమంతుడుగా ఉంటే కుచేలుడు ఆగర్భ దరిద్రుడుగా మారాడు. కాని తనకు తన నేస్తం కృష్ణుడే జగద్గురువు అని తెలిసినా ఒక్క కోరిక కోరలేదు. కాని తిండి గడవక , పిల్లల్ని పోషించలేక కృష్ణ దర్శనం చేసుకొన్నాడు కుచేలుడు. లీలామానుష వేషదారి కృష్ణుడు అని తెలిసినా కుచేలుడు కేవలం స్నేహధర్మాన్ని చూపాడు. అపుడు కృష్ణుడే కుచేలుని దారిద్య్రాన్ని దూరం చేశాడు. అది భగవంతుని లోని అపార కరుణావిశేషం అని భగవంతుని సదా స్మరించుతూ ఉండిపోయాడు కుచేలుడు.
ఆత్మనివేదనం: తనను తాను భగవంతునికి అర్పించుకోవడం దత్తం చేసుకోవడమే ఆత్మనివేదనం. శరణాగతిని పొందటం. విభీషణుడు తన సొంత అన్నకు ఎన్నో హితోపదేశాలు చేసి చేసి విసిగి వేసారి ఇక నాకు దిక్కు శ్రీరాముడు తప్ప అన్యులెవరూ లేరని వచ్చి శరణాగతి పొందాడు. ఆ శ్రీరాముడు విభీషణుని లంకాధిపతిని చేశాడు.
ఏవిధంగానైనా సరే భగవంతునిపై భక్తిని అంకురింపచేసుకొని భగవంతుని ఆరాధిస్తే ముక్తి మోక్షం లభిస్తాయి. దుర్లభమైన మానవ జన్మ సార్థక్యం చెందుతుంది.

- శ్రీమతి గంటి కృష్ణకుమారి 9441567395