Others

అంతా మామూలే అయనా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదంతా మామూలే
అలవాటుగా వింటూన్న, కంటూన్న
విషయాలన్నీ మామూలే
ఉదయం వార్తతో ఒకింత ఉలిక్కిపడ్డానే్నను
వింటూండటం మామూలే అయనా
విస్ఫోటక విషయం హృదయ విదారకం.

దాల్ లేకులు, గుల్ మొహర్ గార్డెన్లున్నా
కాశ్మీర్‌కు హనీమూననుకున్నా
ఆపిల్ తోపుల క్రింద విహారానందం
ఆహ్లాదకర, అనుభూతి పొందుదామన్నా
భారతదేశ భూతల స్వర్గ భావనున్నా
‘అమ్మో కాశ్మీర్’ అన్న భయం,
అనాసక్తి మిన్న అన్నా...

నేటి నా కాశ్మీరం
పరదేశీ గరుడపక్షుల స్వైరవిహారం
అటునుంచి బౌలింగ్,
ఇటునుంచి బ్యాటింగ్ పరిస్థితి
దాహానికి మంచినీళ్ళతో తీరే దాహం
రక్త దాహం తీరని దాహం!
కాశ్మీరు లోయ అందాలకన్నా
తూటాల మోతలే మిక్కుటం
శకలిత భద్రతా బలాల శకటాలు
మారణహోమం, మాంసపు ముద్దలు మామూలే
రావణకాష్టం, రాబందుల రెక్కల చప్పుడు
విన్నప్పుడు, ఉలిక్కిపడ్డప్పుడు
కటకటా అని బొటబొట కన్నీరు మామూలే.
ప్రతీకార ప్రతిదాడుల ప్రతిజ్ఞలు
సామాజిక మాధ్యమాల
నెటిజన్ల నిరసనలు, నివాళులు
రక్తపు మడుగులో
సాయుధ మృత సైనికుడి చిత్రాలు
ప్రాణానికి పైకంతో వెలకట్టే పరిహారాలు
మూలమేదైనా, ఎవరైనా
సమస్యకు పరిష్కారం మృగతృష్ణే.
అంతా మామూలే
అయనా ఆశిస్తా -
సువిశాల సుందర సుమనః మైత్రీ!
సునాదాల నినాదాలు వినబడే
విహంగవనం చూడాలని,
శాంతి, సుస్నేహ, సహకార వసంతాగమనం
చూడాలనే ఆశతో
రాని వర్షం చినుకు కోసం
ఆశతో ఆకాశం వైపు చూసే రైతులా
ఆశిస్తూనే వుంటా, ఘర్షణకు
విరామ చిహ్నం ఎప్పుడా అని.

ద్వైపాక్షిక సంభాషణల పునరుక్తులు
సఫలం కాని చర్చలు అంతా మామూలే అయనా...
తప్పదు యుద్ధం,
తప్పదు బంధు నాశనమనుకున్నప్పుడు
పదే పదే వాలే దోమపై
పడే పెద్ద చావుదెబ్బలా
ముదిరిన మొండివ్యాధికి శరణ్యం శ్రస్తచికిత్సే..

- వేదం సూర్యప్రకాశం, 9866142006