Others

ఆమని గీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సప్తస్వరాల కోయల రాగమా
ఆమని గీతమా
సుమధుర నీ కుహుకుహుల
ఆలాపన విన నా
మది నిండా మరుమల్లెలు పూచే
కన్నుల్లో మెరుపులు మైమరపించే
అధరాలపై చిరునవ్వుల వర్షం కురిసే
కడలి తరంగమల్లే ఉత్సాహం పెల్లుబికే
మయూఖాలు మురిసి మెరిసే
మయూరాలు పురివిప్పి నాట్యమాడే
ముసి ముసి నవ్వులతో భానుడే ఎరుపెక్కె
తెల్లని వెండిమబ్బు
నురగలు తరగలై ఇలకు జారె
ఆమని గీతమా ఆగకుమా
ఎనలేని ఉత్సాహాన్నిచ్చే
నీ అపురూప గాన మధురిమ!

- మహమ్మద్ అఫ్సర్ వలీషా 8500597116