Others

డైరెక్టర్స్ ఛాయిస్.. సక్సెస్ స్ట్రాటజీ ప్రీ ప్రొడక్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-దర్శకుడు శివ ప్రసాద్

అనేక చిత్రాలకు ఘోస్ట్ రైటర్‌గా పనిచేసి, ఆ చిత్ర విజయాల్లో పరోక్షంగా పాలుపంచుకున్న అమనిగంటి
శివప్రసాద్ -ఇప్పుడు ‘ఉందా లేదా?’ అన్న ప్రశ్నను ప్రేక్షకుడికి సంధిస్తూ
దర్శకుడిగా చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఏ చిత్ర విజయానికైనా ప్రీ ప్రొడక్షన్
ముఖ్యమంటున్న శివప్రసాద్‌తో ఈవారం చిట్‌చాట్.
**
మీ నేపథ్యం?
-విజయవాడలో పుట్టి పెరిగాను. బి.ఎస్సీ కంప్యూటర్స్ చేశాక, ఢిల్లీలో ఫిలిం డివిజన్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశా. చాలాకాలం క్రితమే పరిశ్రమకు వచ్చినా.. అనేక చిత్రాలకు పరోక్ష విజయంలో భాగస్వామిగానే ఉండిపోయా. తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రమే ‘ఉందా లేదా?’.

ఇష్టమైన జోనర్
-్ఫ్యమిలీ డ్రామాలంటే ఇష్టం. లవ్, కామెడీతో మిళితమైతే కానె్సప్ట్‌లనూ ఇష్టపడతా.

హారర్, లవ్ జోనర్‌లపై అభిప్రాయం?
-హారర్, లవ్ జోనర్‌లకు ఈజీ యాక్సెస్ ఉంటుంది. పైగా ట్రెండ్ నడుస్తుంది. అందుకే చాలామంది చూపు అటుంది. చాలాకాలంగా తెలుగు సినిమా సెంటిమెంట్, ఎమోషన్ డ్రామాకు దూరమైంది. అందుకే ‘బిచ్చగాడు’ని కోటీశ్వరుడిని చేశారు. ఇదొక కనువిప్పు.

తొలి అవకాశం?
- ‘ఉందా లేదా?’ కథ ముగ్గురు నిర్మాతల దగ్గరకు తిరిగింది. చివరకు నాకు కంఫర్టబుల్ అనిపించిన నిర్మాత అయితం సాయికమల్‌తో తెరకెక్కుతుంది.

సినిమాను ఎలా అసెస్ చేస్తారు?
-ప్రీ ప్రొడక్షనే సినిమాకు ముఖ్యం. పక్కా ప్రణాళిక సిద్ధమైతే, అనుకున్న బడ్జెట్‌లో సినిమా పూర్తి తీయొచ్చు. ఈ విషయంలో మా నిర్మాత నాకు కలిసొచ్చారు.

ఇష్టమైన దర్శకుడు?
-అకిర కురసోవా. ఎందుకు? అనడిగితే ఓ పుస్తకం రాయాల్సి ఉంటుంది.

దర్శకుడంటే?
- సినిమాకు ఫాదర్.

-శేఖర్