Others

కల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమీ తెలియదు
కలో నిజమో...
కలే కదా అనుకోలేం..
నిజమని కూడా.
ఒక గాలి వీచిపోతుంది.
నెమ్మదిగా బహు సుందరంగా
చెంపల్ని సుతారంగా తాకి...
కన్నులు మూతపడి కలలోకి వెళ్లిపోతాం
హాయ గొప్పదనం అది.
బహు జ్ఞానులు పలికేవి
అర్థాలు బోధపడని సత్యాలే కావొచ్చు
నీలి మేఘం తెలిపేది అనురాగమని కదా..
కమ్మని కల
కళ్ళు మూసుకుని మరీ చెప్పింది
తెలిమంచు కురిసిన వేళ
ఆనందం ఉదయంచి రమ్మంటే కదా
చిరునవ్వు సిరిమల్లె విరగకాసేదీ అని.
మనసులో గిరగిరా త్రిగుణాలు తిరుగుతాయని చెప్పకు మహానుభావా!
ప్రేమంటే ఏమిటో ననే్న తెలుసుకోని
కోరిక, తృష్ణ, నిలకడలేనితనం..
అంటూ పేర్లు పెట్టకు.
దురాశ, పేరాశ అంటూ వెంటపడకు
నిద్ర పోవాలనిపిస్తే బద్ధకమని
ముద్ర వెయ్యకు
రాజ్యమేలే దొరల్ని చూసి
అర్థమయపోతూనే ఉంది
అన్నం తినడం.. గాలి పీల్చుకోవడం చాలుకదా ప్రాపంచిక వ్యక్తి కావడానికి.
మా ఇల్లేదో తెలిసీ వెతుక్కోనివ్వకు
మాకో సహజ గుణం ఉంది -
పూవుగా వికసించడం..
ప్రేమగా రాలిపోవడం!

- బులుసు సరోజినీదేవి, 9866190548