Others

భక్తుల కొంగు బంగారం కోటిలింగాలల్లో కొలువైన కోటీశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరీ నదీ దక్షిణ తీరమున పరివ్యాపితమైయున్న కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో, ఉత్తర దక్షిణ భారతీయులకు సేతువై నిలిచిన ఈప్రాంత నాగరికత కాల ప్రవాహంలో కొట్టుకొని పోయినా, ఔత్సాహికులైన చారిత్రక పరిశోధకుల అవిరళ కృషి ఫలితంగా కథలుగా, గాధలుగా, నోళ్ళలో, రాళ్ళలో, ఆకులలో, రేకులలో, ఆక్కడక్కడా నిక్షిప్తమైయున్న చరిత్ర కొంతవరకు వెలుగులోనికిరాగలిగింది. శాతవాహన వంశానికి మూలపురుషుడని భావింపబడే శ్రీముఖుడు కోటిలింగాలను రాజధానిగా చేసుకుని పాలించాడని, ఆయన నాణాలు కోటిలింగాలలోలభ్యమైనాక చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికింది. ప్రస్తుత జగిత్యాల జిల్లాలో ధర్మపురి నియోజకవర్గంలో, ధర్మపురి క్షేత్రానికి 19కి.మీ.ల దూరాన వెల్గటూరు మండలంలోని గోదావరి, పెద్దవాగు సంగమ స్థానమందుగల కోటిలింగాలలోని పుట్టకోట గోడలు (పూర్వపుకోటలు) ఆంధ్రదేశ పాలకులైన శాతవాహనుల తొలి రాజులకు ఆటపట్టయినవి. హాల చక్రవర్తిగాథా సప్తశతిలోని గోదావరీ వర్ణన ఆధారంగా, లభ్యమైనట్టి సిముఖ నాణాలను బట్టి కోటిలింగాల శాతవాహనుల బలిష్ఠ దుర్గమని స్పష్టమైంది. కోటిలింగాల సమీపమునగల గుట్ట జైనమునుల కావాస స్థానముగ నుండేదని తెలుస్తున్నది. ఒకనాడు ఇక్కడి గోదావరి ఓడరేవు ద్వారా వాణిజ్య సరుకులు బంగాళాఖాతం తద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా జరిగేదని చారిత్రక పరిశోధకులు తేల్చారు. సమీపాన క్రీ.పూ.రెండవ శతాబ్దపుబౌద్ధ స్థూపం పాషాయిగాం గుట్టపైన ఉండేది. ప్రస్తుతం మధ్యయుగానికి చెందిన దేవాలయం గ్రామంలోఉంది. రెండు గర్భగృహాలకు ఉమ్మడి మంటపముంది. ప్రతి గర్భగృహంలో అంతరాళం ఉంది. ప్రధానాలయంలో కోటీశ్వరుడు లింగరూపుడుగా ప్రతిష్ఠితుడుకాగా, దక్షిణ దిశలో ఉత్తర ముఖ గర్భగృహంలో సిద్ధేశ్వరుడు లింగరూపుడై ఉన్నాడు. ఆలయం చాళుక్యకళారీతులలోనుండి గోదావరి ఒడ్డున అనేక శిల్ప ప్రతిమలున్నాయి. పురావస్తు శాఖచే త్రవ్వకాలు జరపబడి, పర్యాటక క శాఖ గుర్తింపు పొందింది. ప్రస్తుతం పర్యాటక శాఖ పక్షాన రెండు బోట్లు జలవిహారానికి తోడ్పడుతున్నాయి. స్థానికుల, దాతల చేయూతతో, ధర్మకర్తల మండలుల కృషితో, ప్రత్యేక నిధులను ప్రోగు చేసుకుని దేవస్థానాన్ని అభివృద్ధి పరుచుకున్నారు. ఇటీవలి గోదావరి పుష్కరాలలో లక్షలాది భక్తులు దర్శించాక, మిగుల ప్రచారం పొందిందీ తీర్థ, క్షేత్రం. ప్రస్తుతం తాజామాజీ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ చొరవ ఫలితంగా ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో విశేష అభివృద్ధి జరుగుతున్నది. ధర్మపురి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న కొప్పుల ఈశ్వర్ ఇటీవలే తెలంగాణ మలి ప్రభుత్వంలో మంత్రి పదవి పొందిన క్రమంలో ఈ ఆలయం మరింత పర్యాటక శోభను సంతరించుకోనున్నది.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494