Others

చీడపీడలను దూరం చేసే బేడీ ఆంజనేయస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామభక్తుడైన ఆంజనేయస్వామి వేంకటేశ్వరుని భక్తుడుకూడా. అందుకే వేంకటేశుని ఏడుకొండల్లో ఒకటి అంజనాద్రి అయంది. చిరంజీవి యైన ఆంజనేయుడు ఈ కలియుగంలో తిరుమలలోని శ్రీవేంకటేశ్వరుని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న సన్నిధి వీధిలో కొలువుతీరి ఉన్నాడు. . ఈ ఆలయంలోని హనుమంతుడు బేడి ఆంజనేయస్వామిగా భక్తులచేత పూజలను అందుకుంటున్నాడు. ఈయనకు ఈ పేరు ఏర్పడటానికి వెనుక ఓ కథ ఒకటి ఉంది. అంజనాద్రిపై అల్లరి చేస్తూ విసిగిస్తున్న ఆంజనేయుడిని తల్లి అంజనాదేవి చేతులకు, కాళ్ళకు బేడీలు వేసి, ఇటూ అటూ పరుగులు తీయకుండాఓ సారి స్వామిని వారి అమ్మ శిక్షించిందట. అందుకే ఈ సందర్భాన్ని గుర్తుచేసుకొంటూ ఈ ఆంజనేయునకు ఇప్పటికీ బేడీలు వేస్తారు. అంతేకాక ఈ బేడీఆంజనేయుని దర్శించినవారికిచీడ పీడలు దూరం అవుతాయని మారుతి భక్తుల నమ్మకం. ఇక్కడి అర్చకులు. పశ్చిమాభిముఖంగా ముఖమంటపం, ప్రదక్షిణ మంటపం ఉన్నాయి. గర్భాలయంపైన ఏకకలశ గోపురం ఉంది. గర్భాలయం మధ్యలో ఆరు అడుగుల ఎత్తుతో శ్రీ బేడి ఆంజనేయస్వామి కొలువై ఉన్నారు. ప్రతి ఆదివారం పంచామృతాభిషేకం జరుగుతుంది. ప్రతి నెల పునర్వసు నక్షత్రంనాడు సీతారామలక్ష్మణులు అక్కడకు వస్తారని అంటారు. వారికి ఇచ్చిన శేష హారతిని, శ్రీరాములవారి మెడలోని పుష్పహారాన్ని బేడి ఆంజనేయస్వామికి అలంకరిస్తారు. తిరుమలలో ఉన్న కోనేటికి ఈశాన్య మూలగా, వరాహస్వామివారికి అభిముఖంగా శ్రీ హనుమంతుని ఆలయం నిర్మించబడి ఉంది. కోనేటి గట్టుమీద ఈ స్వామి ఆలయం ఉండటంవల్ల, ఈ స్వామికి కోనేటి గట్టు ఆంజనేయస్వామి అన్న పేరుకూడా ఉంది. శ్రీ ఆంజనేయస్వామివారు నిలబడి నమస్కార భంగిమలో ఇక్కడ కొలువై ఉన్నారు.
శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీ జాబాలి ఆంజనేయస్వామి కోవెల కూడా ఉంది. ఆంజనేయుని జన్మస్థానం కూడా ఇదేనని హనుమంతుని భక్తులు చెబుతారు. మారుతి బాల్యంలో సూర్యభగవానుని ఒక పండుగా భావించి, ఎగురుతూ ఆకాశానికి చేరుకుని సూర్యుని మింగబోయినది కూడా ఇక్కడేనని పురాణాలు చెబుతున్నాయ. ఒకసారి జాబాలి అనే మహర్షి అనేక ప్రాంతాలను పర్యటించి, ఈ ప్రాంతానికి చేరుకుని తపస్సు చేయసాగారు. ఆయన తపస్సుకు మెచ్చిన ఆంజనేయుడు ఆ మహర్షికి దర్శనమిచ్చారు.ఆ మహర్షి కోరికను సమ్మతించిన హనుమంతుడు, స్వయంభువుగా ఇక్కడ అవతరించారు. అందుకే శ్రీ జాబాలి ఆంజనేయస్వామి అనే పేరు ఏర్పడిందని ఇక్కడి స్థలపురాణం చెబుతుంది.

- చివుకుల రామమోహన్